Breaking News

బాధ్యతయుతమైన పేరెంటింగ్‌కి అర్థం ఇదే..!

Published on Mon, 09/01/2025 - 17:45

మంచి తల్లిదండ్రులుగా ఉండటం అంటే అలాంటి ఇలాంటి టాస్క్‌ కాదు ఇది. జీవిత విలువల్ని, పాఠాలను నేర్పే గొప్ప గురు స్థానం దాన్ని సక్రమంగా నిర్వహించడంపైనే పిల్లల ఎదుగుదల, ఉన్నతి ఆధారపడి ఉంటుంది. అది మొగ్గగా ఉన్నప్పటి నుంచి నేర్పాలి అనేందుకు నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోనే ఉదాహారణ

ఆ వీడియోలో మైఫండ్‌బాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈవో అనుజ్‌పాల్‌ తన కొడుతో సంభాషిస్తున్నట్లు కనిపిస్తుంది. నీస్కూల్‌ నుంచి ఫిర్యాదు వచ్చిందని అడగగా, అందుకు కొడుకు అద్విక్‌ ఒకరిని కొట్టానని సమాధానమిస్తాడు. అలా ఎలా ఒక వ్యక్తిపై చెయ్యి ఎత్తడం కరెక్టేనా అని అడుగుతాడు. ఆ పని రౌడీలే చేస్తారు. నువ్వు రౌడీ లేదా హీరోలా ఉండాలనుకుంటున్నావా అని అడగగా..హీరోలానే ఉండాలనుకున్నట్లు సమాధానమిస్తాడు. 

అలాంటప్పుడు ఎంతో హుందాగా ఉండాలని, పక్కవారి వస్తువులను తీసుకోకూడదని ఆ సీఈవో తండ్రి కుమారుడికి హితవు చెబుతాడు. మరి హీరోలా ఉండాలనుకున్నప్పుడూ తప్పు చేసిన దానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి కదా అని తండ్రి అడగగా, అందుకు కొడుకు చెబుతానని అంగీకరిస్తాడు. అంతేగాదు వీడియో చివరలో కొడుకు అద్విక్‌ తన క్లాస్‌మేట్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కూడా. 

ఈ వీడియోని చూసిన నెటిజన్లు పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడూ..కోపంతో కాకుండా ఆలోచనాత్మకంగా చేసిన తప్పుని వివరించి మంచిగా ప్రవర్తించేలా చేయాలి. ఒక్కోసారి కోపంతో కాకుండా విమర్శనాత్మక ధోరణితో తీర్చిదిద్దడమే ఉత్తమం. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్‌ పాఠం అంటూ సదరు సీఈవో స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్‌ స్థాయికి..)



 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)