Breaking News

అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..

Published on Mon, 06/23/2025 - 11:02

ఒకప్పుడూ ఆర్మీలో ఉన్నతాధికారిగా సేవలందించింది. ఇప్పుడు వీధుల్లో ఫుడ్‌స్టాల్‌ నడుపుతూ లైఫ్‌ని లీడ్‌ చేస్తోంది. అయితే ఆమెలో అప్పుడలా..ఇప్పుడిలా అనే నైరాశ్యం అణువంతైనా తొణికిసలాడదు. నెట్టింట ఆమె కథ వైరల్‌లగా మారి ఎందరి మనసులనో కథిలించింది. 

ఎవరామె అంటే..79 ఏళ్ల ఈ వృద్ధురాలు ఒకప్పుడు ఆర్మీ మాజీ సైనికురాలు. అయితే ఆమె అస్సలు వివాహమే చేసుకోలేదట. ఆమె భారత సైన్యంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసి పదవీవిరణమ చేసినట్లు తెలిపింది. అయితే ఆమెకు కుకింగ్‌ అంటే మహా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఇండోర్‌ వీధుల్లో ఒక ఫుడ్‌స్టాల్‌ని నడుపుతోంది. ఆమె ముంబైలో ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించింది. 

కొన్నేళ్లు జీవితంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తన గత జీవితంలోనూ, ప్రస్తుతం ఎంతో ఆనందంగా సంతృప్తిగా జీవిస్తున్నానని ధీమాగా చెబుతోందామె. ఇక్కడ ఆ మహిళ ఈ వయసులో ఒంటరిగా ఈ వ్యాపారం ఎలా చేయగలను అనే సందేహానికి తావివ్వకుండా సాధికారత, సానుకూలతలను అస్త్రాలుగా  చేసుకుని ముందుకు సాగడం ప్రశంసనీయం. 

అందుకు సంబంధించిన వీడియోని కాశీష్ సోని అనే సోషల్‌ మీడియా ఔత్సాహికురాలు నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. పైగా ఆ వీడియోకి లక్షకు పైగా లైక్‌లు వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు సైతం ఒంటరిగా కూడా మహిళలు లైఫ్‌ని లీడ్‌ చేయగలరు అనడానికి ఈ మాజీ భారత ఆర్మీ హీరోనే ఉదాహరణ, ఎందరికో ఆ వృద్ధురాలు స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. 

 

(చదవండి: World Motorcycle Day: రైడింగ్‌ స్కిల్‌తో అదరగొట్టిన ఉమెన్‌ రైడర్స్‌..!)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)