Breaking News

రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్‌..

Published on Tue, 06/02/2026 - 13:00

ధ్యాన సాధన గురించి ప్రముఖ యోగా గురువుల వద్ద శిక్షణ తీసుకుని మరీ ప్రయత్నిస్తుంటాం. అయినప్పటికీ నిలకడ సాధ్యం గాక పట్టు సాధించలేకపోతుంటాం. అలాంటి ధ్యాన సాధనను గౌతమ్‌ వైష్ణవ్‌ అనే కళాకారుడు రాళ్లతో అలవోకగా నేర్పిస్తున్నాడు. అదెలాగో తెలిస్తే..విస్తుపోతారు.

రాళ్లతో సాధన అంటే..సున్నితమైన ఆకృతుల్లో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చేలా సమతుల్యం చేయడం. అందుకోసం ఎలాంటి జిగురు ఉపయోగించరు. ఇది కేవలం మన ఏకాగ్రత, ఓపికలకు సంబంధించిన సామర్థ్యం. మరి ఇదెలా ధ్యాన సాధన అవుతుందంటే..ముంబైకి చెందిన కళాకారుడు గౌతమ్ వైష్ణవ్ ధ్యాన చేయడం ఎలా అనేది నేర్పించారు. కేవలం చేసేలా ఈ టెక్నిక్‌తో బలవంతం చేస్తారు. 

అంటే వివిధ రాళ్లను వాటిని ఒకదానిపై ఒకటి నిలబడేలా చేసే టెక్నిక్‌ని నేర్పిస్తారు. అంతే అదే వారిని లోతైన ధ్యాన సాధన చేసేలా చేస్తుంది. ఇక్కడ ఈ టెక్నిక్‌లో రాళ్లతో మమేకమవ్వుతారు. ఒకదానిపై ఒకటి పెట్టే క్రమంలో ఓపిక, పదే పదే ప్రయత్నాలు..ఏకాగ్రత, నిలకడని పెంపొందిస్తాయి. పైగా ఏ కేంద్రం వద్ద రాయి నిలబడగలదు అనే దానిపై పూర్తి అటెన్షన్‌ సామర్థ్యం పెంపొంది సులభంగా తనకు తెలియకుండానే ధ్యాన సాధన చేయగలుగుతారు. 

రాళ్లను సమతుల్యంచేసే కళాత్మక నైపుణ్యం ఏళ్లు గడిచే కొద్ది లోతైన ధ్యాన సాధనగా పరిణామం చెందుతుందట. ఇది ఏకాగ్రత, సహనం, భావోద్వేగ స్థిరత్వం, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ టెక్నిక్‌లో రాయి చేప్పేది వింటుంటారు. అదే అన్ని నేర్పిస్తుందని అంటున్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో కావాల్సింది కూడా ఇదే. ఇదొక విభిన్నమైన ధ్యాన పద్ధతని గౌతమ్‌ నొక్కి చెబుతున్నారు. 

అందుకే తాను ఎవ్వరికి ధ్యానం గురించి భోధించనని, చేసేలా బలవంతం చేస్తానని నవ్వుతూ చెబుతున్నారు. ఆలోచనలను నిశబ్దం చేయడానికి సతమతమయ్యే వాళ్లకు ఈ టెక్నిక్‌ ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది పూర్తి మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత విధానం అని అంటున్నారు గౌతమ్‌. దాదాపు 90 నిమిషాల పాటు ఎవరైనా నిరంతరాయంగా రాళ్లను సమతుల్యం చేసేలా దృష్టిసారిస్తే..కచ్చితం మిగతా విషయాలన్నింటి గురించి ఆలోచించడం మానేస్తారని అంటున్నారు. 

తమకు తెలియకుండానే నిశ్చల స్థితిని అనుభవిస్తారని అంటున్నారు. ధ్యానం అంటేనే ఎలాంటి ఆలోచనలు లేని నిశ్చల స్థితి, శ్వాసపై ధ్యాస అది ఈ టెక్నిక్‌తో సులభంగా అలవడుతుందని గౌతమ్‌ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..ధ్యాన సాధన సునాయాసంగా నేర్చుకోండి. 
 

(చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..)
 

 

#

Tags : 1

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు