Breaking News

‘విలేజ్‌ హాలోవీన్‌ పరేడ్‌’కి వెళ్లాలంటే..గట్స్‌ ఉండాలి..!

Published on Sun, 10/26/2025 - 12:45

న్యూయార్క్‌ నగరంలో జరిగే ‘విలేజ్‌ హాలోవీన్‌ పరేడ్‌’కి వెళ్లాలంటే గుండెల్లో దమ్ముండాలి. ఇది గ్రీన్‌విచ్‌ విలేజ్‌ పరిసర ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న రాత్రి ఏడుగంటల నుంచి జరుగుతుంది. ఈ వేడుకలో అడుగడుగునా, దారిపొడవునా హడలెత్తించే రూపాలు దర్శనమిస్తాయి. హాలోవీన్‌లో పాల్గొనే ప్రజలంతా దయ్యాలు, భూతాలు, రక్తపిశాచాలలాంటి భయంకరమైన వేషాలు వేసుకుని తిరుగుతారు.

ఈ హాలోవీన్‌ పండుగకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అక్టోబర్‌ 31న వారి కాలమానాల ప్రకారం జీవించి ఉన్న ప్రపంచానికి, చనిపోయిన వారి ఆత్మల లోకానికి మధ్యనున్న తెర పలుచబడుతుందని, దాంతో ఆత్మలు భూమిపైకి వస్తాయని అక్కడివారు నమ్మేవారు. అందుకే చెడు ఆత్మలను తమ దగ్గరికి రాకుండా ఆపడానికి, భయపెట్టడానికి లేదా ఆ ఆత్మలు తమను గుర్తుపట్టకుండా ఉండటానికి ప్రజలు భయంకరమైన లేదా వింతైన వేషాలను ధరిస్తారు.

1974లో చిన్నపాటి కమ్యూనిటీ ఈవెంట్‌గా దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హాలోవీన్‌ పరేడ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఊరేగింపులో సుమారు 50 వేలమందికి పైగా చిత్రవిచిత్రమైన వేషధారణలతో ఎంట్రీ ఇస్తారు. వేలాదిమంది దీనిని తిలకించడానికి తరలివస్తారు. ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ– భారీ తోలుబొమ్మలే. 

అవి కూడా హడలెత్తించేలానే హారర్‌ సీన్‌ను క్రియేట్‌ చేస్తాయి. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. భయపెట్టే కాస్ట్యూమ్‌ వేసుకున్న ఎవరైనా వచ్చి నేరుగా ఈ ఊరేగింపులో చేరవచ్చు. సాధారణంగా ఈ పరేడ్‌ మాన్‌హట్టన్‌లోని సిక్స్‌త్‌ అవెన్యూలో కెనాల్‌ స్ట్రీట్‌ నుంచి 15వ వీధి వరకు సాగుతుంది. 

నిజానికి ఈ పరేడ్‌ న్యూయార్క్‌ నగర ప్రజల సృజనాత్మకతకు ఒక వేదిక. ఈ వేడుకలో పాల్గొనేవారంతా తమకు ఇష్టమైన వేషధారణలో రోడ్లమీదకు వస్తారు. ‘అలా వేరొక వేషధారణలో రావడంతో తమ నిజ జీవిత పాత్రల నుంచి ఒక రాత్రి బయటపడటమనేది ఒక ప్రత్యేక అనుభూతి’ అంటారు వాళ్లంతా. ఏది ఏమైనా ఈ పరేడ్‌లో వణుకు పుట్టించే డెవిల్‌ వేషాలను చూడాలంటే గుండెల్లో దమ్ము ఉండాల్సిందే మరి!
· సంహిత నిమ్మన 

(చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)