Breaking News

Dussehra 2024: శరన్నవరాత్రుల సంబరం, దసరా ఎపుడు వచ్చింది?

Published on Fri, 09/20/2024 - 14:54

వినాయక చవితి పండుగ వేడుక ముగించుకొని,  బై..బై. గణేశా అంటూ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అలా ముగిసిందో లేదో మరో పండుగు సందడి మొదలైంది. అదే సరదాల దసరా పండుగ. దేశవ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవడానికి రెడీ అయిపోతున్నారు.  మరి  ఈ  ఏడాది దసరా పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసా?  ముహూర్తం ఎపుడు? తెలుసుకుందాం రండి.

దసరా పండుగ, శుభ సమయం 
చెడుపై మంచి సాధించిన విజయానికి  ప్రతీకగా  ప్రతీ ఏడాది దసరా పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం, దశమి రోజున  అక్టోబరు 12న విజయ దశమి వచ్చింది.   2వ తేదీనుంచి శరన్నవరాత్రులు ఆరంభం కానున్నాయి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ  దుర్గా భవాని  మహిషాసురుడిని  సంహరించి ప్రజలకు శాంతిని చేకూర్చింది. అందుకే ఇది  విజయదశమి అయిందని పెద్దలు చెబుతారు.  

అలాగే శ్రీరామడు రావణుడిని తుదముట్టించడం ద్వారా అధర్మంపై ధర్మం గెలిచిన రోజు కనుక విజయ దశమి అయిందని మరో కథనంలో చెబుతారు.  విజయదశమి నాడు రావణ  దహనం చేసి సంబరాలు చేసుకుంటారు.  ద‌శ‌మి రోజు శ‌మీ పూజ‌, రావ‌ణ ద‌హ‌నంతో పాటు పాలపిట్ట‌ను ద‌ర్శించుకోవ‌డం ఆన‌వాయితీగా వస్తుంది. ద‌స‌రా రోజు పాలపిట్ట‌ క‌నిపిస్తే శుభ‌సూచికంగా భావిస్తారు. 

పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించుకుని, శమీ వృక్షంలో  దాచిపెట్టిన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగా కూడా చెబుతారు. ఈ క్రమంలో జమ్మి చెట్టుకు పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గమ్మ ఎదుట జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పంచిపెట్టి అలాయ్ బలాయ్ తీసుకుంటారు.  ఇంటి ఆడపడుచులకు కూడా ప్రేమగా పంచుతారు.

ముహూర్తం: గణేష్‌ చతుర్థి తరువాత  అంతే  ఉత్సాంగా నవరాత్రులు వేడుక చేసుకునేపండుగ దసరా పండుగ.  ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో  అమ్మవారిని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్ష  తిథి అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం పూజ సమయం మధ్యాహ్నం 1:17 నుండి 3:35 వరకు ఉండనుంది. 
  
 

Videos

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)