Breaking News

విద్యాబాలన్‌ వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌..కానీ వర్కౌట్‌లు మాత్రం..!

Published on Thu, 10/31/2024 - 14:10

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ ఫిట్‌నెస్‌ పరంగా విద్యా చాలా ఇబ్బందులు పడింది. ఒక్కోసారి చాలా స్లిమ్‌గా, మరోసారి లావుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారడమే గాక బాడీని అదే ఫిట్‌నెస్‌తో మెయింటైన్‌ చేయడంలో విజయవంతమయ్యింది. అందుకోసం తాను ఏం చేసిందో ఓ ఇంటర్యూలో వివరంగా వెల్లడించింది కూడా. ఇంతకీ విద్యా బాలన్‌ వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌ ఏంటంటే..

విద్యాబాలన్‌ తను స్లిమ్‌గా మారేందుకు ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తాను నాజుగ్గా ఉండాలని చాలా పిచ్చిగా వర్కౌట్‌లు చేసినట్లు వెల్లడించింది. అయితే అంతలా చేసినా.. తన బరువులో పెద్ద మార్పు కనిపించక చాలా విసిగిపోయినట్లు తెలిపింది. దాంతో తాను చెన్నైలోని 'అమురా' అనే న్యూట్రిషన్‌ బృందాన్ని కలిసినట్లు పేర్కొంది. అయితే వాళ్లు నిజంగా ఇది లావు కాదని తేల్చి చెప్పారు. 

బరువు తగ్గడంలో మంచి మార్పు కనిపించాలంటే సరైన డైట్‌ పాటించాలని అన్నారు. అలాగే ముందుగా తనని ఇలా విపరీతమైన వ్యాయామాలు చేయడం మానేయమని చెప్పారు నిపుణులు. అలాగే ముందుగా ఇన్‌ఫ్లమేషన్‌ని వదిలించుకునేలా ఆహారం తీసుకోవాల్సిందిగా న్యూట్రిషన్లు సూచించారు. అంటే ఇక్కడ శరీరానికి సరిపడని ఆహారాన్ని తొలగించడమే ఇన్‌ఫ్లమేషన్‌ డైట్‌. అయితే ఇదేలా పనిచేస్తుందంటే.. 

'ఇన్‌ఫ్లమేషన్ ఎలిమినేషన్' డైట్ అంటే..
ఇది యాంటీ ఆక్సిడెంట్‌లతో కూడిన ఆహారం. పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి.. వాపుని, మంటని అరికట్టే మంచి ఆహారం. ఇవి తప్పక డైట్‌లో చేర్చుకోవాల్సిని మంచి ఫుడ్స్‌గా పేర్కొనవచ్చు.

కూరగాయలు..
బ్రోకలీ, కాలే, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తప్పక డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

పండ్లు..
బ్లూబెర్రీస్, దానిమ్మపండ్లు, ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు
అవకాడోస్, ఆలివ్ వంటి అధిక కొవ్వు ఉండే వాటిని చేర్చుకోవాలి. 

మంచి కొవ్వులు ఉండే చేపలు
మాంసాహారులు మంచి పోషకాల కోసం సాల్మన్, సార్డినెస్,  ఇంగువ వంటి రకాల చేపలను తీసుకోవాలి. 

సుగంధ ద్రవ్యాలు, నట్స్‌
బాదం, పిస్తా వంటి వాల్‌నట్‌ల తోపాటు పసుపు, మెంతులు దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. 

(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్‌ మట్టితో..!)

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)