Breaking News

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ : రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన డెలివరీ బోయ్‌, వైరల్‌ వీడియో

Published on Thu, 07/25/2024 - 16:11

అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే  ఆకలి.  ఉందిగా ఆన్‌లైన్‌ ఫుడ్ అంటూ‌ ఆర్డర్‌ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు.  అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని  ఆకలి తీరలేదు సరికదా  కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. 

విషయం ఏమిటంటే...   వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర  జైస్వాల్  ఓలా ఫుడ్స్  ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశాడు. డెలివరీ ఏజెంట్‌ ఫోన్‌ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్‌ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన  జైస్వాల్‌  ఆ తరువాత సరే అన్నాడు.   ఆసగా ఫుడ్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా  ఫుడ్‌ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేస్తున్న  దృశ్యాన్ని షాక్‌ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై"  (ఏం చేసుకుంటావో  చేస్కో)  అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి  లోనయ్యాడు.   తన ఫుడ్‌ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్‌సైకిల్‌పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్‌ను భోంజేస్తున్న  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్‌ మీడియాలో   పోస్ట్‌ చేశాడు.

దీనిపై చాలామంది ఎక్స్‌ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్డర్‌ ప్లేస్‌ అవుతుంది. డెలివరీ బోయ్‌ జాడ ఉండదు.  కాల్‌కి సమాధానం ఉండదు. ఓలా  ఫుడ్స్‌కి  ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్‌ కేన్సిల్‌ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్‌. ఈ ప్లాట్‌పాంలో సీవోడీ(క్యాష్‌ అన్‌ డెలివరీ) అప్షన్‌లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్‌ చేయకుండానే ఫుడ్‌ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా  ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్‌ ఇంకా స్పందించలేదు.
 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)