Breaking News

‘ఫ్యాషన్ ఐకాన్’ : 70 ఏళ్లు దాటితేనేం, ఆమే బ్యూటీ క్వీన్‌

Published on Wed, 03/12/2025 - 12:20

ష్యాషన్‌ క్వీన్‌ అనగానే గుర్తొచ్చే సీనియర్‌ నటీమణులలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ నటి రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా,  ఫ్యాషన్‌  ఐకాన్‌లా ఉంటారామె.  ఆమె చీర కడితే ఆ చీరకే అందం.  కాంజీవరం చీరలో ఆమె అందానికి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. ఆమె  ఏ వేదిక మీద ఉన్నా ఆ వేదిక కళకళలాడిపోవాల్సిందే.. ఆమె  అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి సింగర్‌. చాలా సార్లు ఈ విషయాన్ని స్వయంగా చాటి చెప్పింది.  అందానికీ, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన రేఖ  సిగ్నేచర్  స్టైల్‌ చీరలో కాకుండా ఓవర్ సైజు బ్లేజర్‌లో మరోసారి అల్టిమేట్ స్టైల్ ఐకాన్‌గా నిలిచింది.   స్టైల్, గ్రేస్,  డై-హార్డ్ లుక్స్‌తో ఫ్యాషన్‌కు,  మెడ్రన్‌ స్టైల్‌కు వయస్సు  పనేముందని  నిరూపించిన వైనం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో లేడీ బాస్‌ తన ఎనర్జీతో అక్కడున్న వారి నందరినీ అబ్బురపర్చింది. ‘పింటు కి పప్పీ’ ట్రైలర్ లాంచ్‌లో అద్భుతమైన తెల్లటి ప్యాంటుసూట్‌లో చిక్‌ లుక్‌లో ఆకట్టుకుంది.శాటిన్ బ్లౌజ్‌,దానిపై లేయర్డ్ ట్రెండీ ఓవర్ సైజు బ్లేజర్‌ను జోడింకి ట్రెండీగా మెరిసింది. దీనికి వైడ్‌ లెగ్‌  ట్రౌజర్‌తో జత చేసింది. బ్లాక్‌ సన్ గ్లాసెస్, బంగారు చెవిపోగులు, స్టైలిష్‌గా వైట్‌ క్యాప్‌ ఆమె లుక్‌కు మరింత గ్లామర్‌ను తెచ్చి పెట్టాయి.    అలాగే ఒక అందమైన  షాయరీని చదవి వినిపించడం విశేషం.

అంతేనా, మెటాలిక్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ స్నీకర్లతో మరింత యంగ్‌గా, ఫ్రెష్‌గా లుక్‌తో మెస్మరైజ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా  మారాయి. ఆమె స్టైల్‌ను ఫ్యాన్స్‌ పొగడ్తల్లో ముంచేశారు. "జస్ట్ లుకింగ్ లైకే  వావ్!’’, ‘‘ఆమెకు70 ఏళ్లు అని నేను నమ్మలేకపోతున్నాను" "ఫ్యాషన్ ఐకాన్" ఇలా అందరూ రేఖను ప్రశంసించారు. ఇటీవల IIFA అవార్డ్స్ 2025  వేడుకలో రేఖ అద్బుతమైన కాంజీవరం చీరలో కనిపించారు. అవార్డు ఫంక్షన్‌లో రేఖ తన ఐకానిక్ బంగారు కాంజీవరం చీరలలో అద్భుతంగా కనిపించింది. 

ఆమె లుక్‌తో పాటు, తన సహనటులు, ఇప్పటి నటులతో పాటు, అభిమానులతో ప్రేమగా ఉండటం  ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక అభిమాని ప్రత్యేకంగా తీసుకొచ్చిన  అందమైన బొమ్మను స్వీకరించడం, తన అభిమానాన్ని చాటుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, సినిమాకు సంబంధించి ముఖ్యమైన ఏ వేడుక అయినా, తన సమయాన్ని కేటాయించడం,  కళామతల్లిపై  ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. రేఖగా  పాపులర్‌ అయిన భానురేఖ గణేషన్, 1954లో అక్టోబర్ 10న పుట్టింది. 180కి పైగా చిత్రాలలో నటించిన రేఖ, జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక  పురస్కారాలను దక్కించుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)