Breaking News

మిరాకిల్‌.. వెంటిలేటర్‌ తీయగానే, షేర్‌ సింగ్‌ బతికొచ్చాడు!

Published on Thu, 07/17/2025 - 16:20

‘‘బాజా భజంత్రీలతో కళకళలాడాల్సిన ఇల్లు..వల్లకాటిలా మారిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే...తాళి కట్టిన చేతులతోనే.’’ ఇలాంటి వార్తలను చదివి, వినీ వినీ విసిగిపోయిన వారికి నిజంగా ఇది  మిరాకిల్‌.  బంధువులంతా బరువెక్కిన గుండెలతో, అశ్రునయనాలతో అంత్యక్రియలకు సిద్ధమవుతున్న వేళ చనిపోయిన మనిషి తిరిగి బతికి వచ్చాడు. హర్యానాలో అద్భుతం జరిగింది. దీంతో ఆ కుటుంబం  తొలుత ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంత్యక్రియల కోసం చేసిన ఏర్పాట్లన్నీ అంతులేని ఆనందంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.  

హర్యానాలోని  యమునానగర్ జిల్లాలోని కోట్ మజ్రిలో ఈ  అద్భుతమైన సంఘటన  చోటుచేసుకుంది. షేర్ సింగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో  పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం షేర్ సింగ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సహ్యులు అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలకు కలప శ్మశానవాటికకు చేరుకుంది.  దూరం నుండి వచ్చిన అతిథులు, ఇతరుల కోసం ఆహారం కూడా సిద్ధం చేశారు. అంత్యక్రియలకు సన్నాహాలు పూర్తయ్యాక,  స్నానం చేయించే ముందు అతని వెంటిలేటర్ ట్యూబ్‌ను తొలగించారు.  ఆ మరుక్షణంలో అతను కళ్ళు తెరిచి దగ్గు ప్రారంభించాడు. షేర్‌సింగ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

విచిత్రంగా వెంటిలేటర్‌ పైపు తొలగించగానే, షేర్ సింగ్ ఆకస్మికంగా ఊపిరి పీల్చుకోవడం ఆనందాన్ని కలిగించిందని స్థానిక మాజీ సర్పంచ్ రంజిత్ సింగ్ తెలిపారు అందరూ ఆనందంగా భోజనాలు ముగించి అదృష్టవంతుడు  షేర్‌ సింగ్‌ అంటూ మనుసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ  సంతోషంగా తమ తమ ఇళ్లకు చేరారు.

ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్‌ చేస్తే కోటీశ్వరుడుగా
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)