Breaking News

చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

Published on Wed, 07/31/2024 - 08:22

వేరుశనగపప్పులు బూజు పట్టి, చర్మం ముడుచుకుని పోయి ఉన్నాయంటే అవి తెగుళ్ల కారణంగా విషపూరితమయ్యాయని అర్థం. ఫంగస్‌ సోకిన, ముడుచుకుని పోయిన వేరుశనగ పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషాల బారిన పడకుండా దేహాన్ని సంరక్షించే ప్రక్రియలో మొదటగా దెబ్బతినేది కాలేయం, వ్యాధినిరోధక వ్యవస్థ.

బూజు పట్టిన పప్పులు లివర్‌ డ్యామేజ్‌కి కారణమవుతాయి. కాలేయం వాపు, మచ్చలతోపాటు పనితీరు లోపించడం, లివర్‌ క్యాన్సర్‌ వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. వీటితోపాటు తక్షణం బయటపడే అనేక ఇతర అనారోగ్యాలు, అలర్జీలు, కడుపు నొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్లో బ్రాంకైటిస్, ఆస్త్మాతోపాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పెద్ద పేగు క్యాన్సర్‌లకు దారితీస్తుంది. సంవత్సరాలపాటు ఆహారంలో ఇవి కొనసాగినట్లయితే నర్వస్‌ సిస్టమ్‌ కూడా బలహీనపడుతుంది. తరచూ తలనొప్పి, దేహంలో ప్రకంపనలు, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. మనం ఊహించని మరో సమస్య పునరుత్పత్తి వ్యవస్థ అపసవ్యతలకు లోనుకావడం కూడా.

అందుకే వేరుశనగపప్పులనాణ్యతను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వంటల్లో వాడాలి. పప్పులను కొన్న వెంటనే పేపర్‌ మీద పోసి బూజుపట్టిన, ముడుచుకు పోయిన పప్పులను తొలగించి మంచి పప్పులను డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. పప్పులు సేకరించి నూనె పట్టించుకునే వాళ్లు కూడా బూజు పట్టిన పప్పులను, డొల్లగా ఉన్న పప్పులను జాగ్రత్తగా ఏరి పారేసి మంచి పప్పులతో నూనె పట్టించుకోవాలి.


సుజాత స్టీఫెన్‌ ఆర్‌.డి, న్యూట్రిషనిస్ట్‌

ఇవి చదవండి: వంధ్యత్వం కాదు.. అంధత్వం!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)