Breaking News

‘జయ’ చాలా లక్కీ... విదేశాలకు చెక్కేసింది!

Published on Fri, 10/27/2023 - 11:42

ఛీ.. కుక్క బతుకు అని తిట్టుకుంటుంటారు చాలామంది. కానీ ఈ కుక్కను చూశాక కచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారు. నో డౌట్. ఎందుకంటే మనిషి ఎవరి ముందైనా లోకువైనా లేదా తక్కువైతే ఛీ కుక్క బతుకు అని ఈజీగా అనేస్తాడు. నిజానికి వాటి విశ్వాసం ముందు మనిషి ఎందుకు పనికిరాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక వీధి కుక్క అదృష్టం మాములుగా లేదు. ఓ విదేశీయురాలి మనసు దోచుకుని ఆమె తోపాటు విదేశానికి వెళ్లే అదృష్టాన్ని కొట్టేసింది. 

వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కి చెందిన మెరల్‌ బోంటెన్‌బెల్‌ ఉ‍త్తరప్రదేశ్‌లోని వారణాసికి వచ్చింది. కాశీ నగరం అందాలు ఆస్వాదిస్తూండగా జయ అనే ఆడ వీధి కుక్క ఆమె వద్దకు వచ్చి తచ్చాడింది. ఆమె కూడా ఆ కుక్కను చూసి భలే ముద్దుగా ఉందని కాసేపు దానితో గడిపి వెళ్లిపోయింది. ఐతే ఈ కుక్క ఆమెను కొంతసేపు ఫాలో అయ్యి ఆమె వద్ద ఉండే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఇంకో కుక్క ‘జయ’పై  దాడి చేసింది.

సమీపంలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు జయను రక్షించాడు. ఈ ఘటన తరువాత బోంటెన్‌బెల్‌ వెంటనే తన మనసు మార్చుకుని ఆ కుక్కను తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. తనతోపాటు నెదర్లాండ్స్‌కి తీసుకువెళ్లాలని డిసైడ్‌ పోయింది కూడా. ఆరునెలలపాటు శ్రమించి కుక్కకి పాస్‌పోర్ట్‌, వీసా ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల అనుమతులు లభించడంతో ఎట్టకేలకు స్వదేశానికి పయనమయ్యేందుకు సిద్ధమైంది  బోంటెన్‌బెల్‌.

అనుకున్నట్లుగానే ఆ కుక్కకి పాస్‌పోర్ట్‌, వీసా కూడా వచ్చేయండతో సంతోషంగా బోంటెన్‌బెల్‌ ఆ కుక్కును తనతోపాటు నెదర్లాండ్స్‌ తీసుకువెళ్లిపోయింది. నిజానికి అదేం జాతి కుక్క కాదు. ఆ కుక్కలో ప్రత్యేకతకు కూడా ఏమిలేదు. అదృష్టం ఆ విదేశీయురాలి రూపంలో వెతుక్కుంటు రావడమే గాక చక్కగా ఆమెను యజామనిగా మార్చుకుని నెదర్లాండ్స్‌ చెక్కేసింది ఆ వీధి కుక్క. 

(చదవండి: ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)