అతిపెద్ద ఏకకణ జీవి..!

Published on Sun, 08/10/2025 - 11:49

భూమ్మీద ఎన్నో ఏకకణ జీవులు ఉన్నాయి. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఏకకణ ఫంగస్‌లు వంటివి కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. వీటిని చూడాలంటే, మైక్రోస్కోప్‌ కావాల్సిందే! అయితే, ఇది అతిపెద్ద ఏకకణ జీవి. 

చిన్నపిల్లలు ఆడుకునే గోలీ పరిమాణంలో, ఇంచుమించుగా ద్రాక్షపండు పరిమాణంలో ఉంటుంది. దీనిని నావికుల కనుగుడ్డు (సెయిలర్స్‌ ఐబాల్‌), సముద్రపు ద్రాక్ష (సీ గ్రేప్‌), బుడగ నాచు (బబుల్‌ ఆల్గే) అనే పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయనామం ‘వాలోనియా వెంట్రికోసా’. 

ఇది ఎక్కువగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోని సముద్రాల్లో జీవిస్తుంది. సాధారణంగా ఏకకణ జీవులకు ఒకే కణ కేంద్రకం (న్యూక్లియస్‌) ఉంటుంది. ఈ ఏకకణ జీవి అనేక సైటోప్లాజమ్స్‌తో కలసి ఏర్పడటం వల్ల దీనిలో అనేక న్యూక్లియస్‌లు ఉంటాయి. కరీబియన్‌ తీర ప్రాంతాల్లోను, బ్రెజిల్‌ దక్షిణ తీరంలోను, ఫ్లోరిడా ఉత్తర తీరంలోను సముద్రపు ఒడ్డున ఇవి తరచుగా కనిపిస్తుంటాయి. 

(చదవండి: ఇవోరకం పూతరేకులు..!)

#

Tags : 1

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)