Breaking News

Valentines Day: ఒక ప్రేమిక సజీవ కథ

Published on Sat, 02/14/2026 - 04:58

‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’... ప్రేమకు భయం లేదని, వెరపు వద్దని చెప్పిన పాత్ర అనార్కలీ. ఆ పాత్రకు జీవం పోసిన మధుబాల లక్షల అభిమానుల ప్రేమిక. ఫిబ్రవరి 14న ఆమె జన్మించడం యాదృచ్చికం కాదు. ఆమె పుట్టుక ఒక గొప్ప ప్రేమ కథ ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’ను ఆచంద్రార్కం చేసింది. ఆమె జీవితం వినూత్న ప్రేమకథగా ముగిసింది. ప్రేమికుల దినం ప్రత్యేక కథనం.

మధుబాల గుండెలో బాల్యం నుంచి రంధ్రం ఉంది. ఆ తర్వాత ఆ గుండెను ఎందరో తూట్లు పొడిచారు. తెర మీద. తెర బయట.

‘మొఘల్‌–ఏ– ఆజమ్‌’లో అనార్కలీ ప్రేమను అక్బర్‌ చక్రవర్తి అంగీకరించడు. నిజజీవితంలో మధుబాల ప్రేమను ఆమె తండ్రి అంగీకరించలేదు. తెర జీవితం, నిజ జీవితం కొందరికి ఒకేలా మారతాయి.

‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’లోని అనార్కలీ పాత్ర మొదట నర్గీస్‌కు వెళ్లింది. నాటి సింగింగ్‌ సూపర్‌ స్టార్‌ సురయ్యకు వెళ్లింది. ఇద్దరూ చేయలేదు. దానికోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు అది ఆమెకే కదా చేరాలి. చేరింది. మధుబాల అనార్కలీగా నటించింది. నటించడం ఏమిటి... మధుబాలే అనార్కలీ అయ్యింది. సువాసనలీనే పువ్వు తొందరగా రాలిపోతుందన్నట్టు మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. కారణం– అనార్కలీ పాత్ర ఆమెను బతికిస్తూ ఉంది.
కాదు– ఆమె అనార్కలీని పునరుజ్జీవం చేస్తూ ఉంది. సరే.. ఇద్దరూ కలిసి ప్రేమకు అమరత్వం తెచ్చారు.

‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’ కథ నిజమో అబద్ధమో తెలియదు కాని అది జనానికి చాలా ఇష్టం. ఒక నిరుపేదరాలిని రాకుమారుడు, భావి సామ్రాట్‌ కోరుకుంటే ఆ కథ జనానికి నచ్చకుండా ఎలా ఉంటుంది? 
అక్బర్‌ కుమారుడు జహంగీర్‌ (ముద్దుపేరు సలీమ్‌) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అది తెలిసి అక్బర్‌ ఆమెను సజీవ సమాధి చేశాడట. అలాగని జనస్మృతిలో ఉన్న కథను దర్శకుడు కె.ఆసిఫ్‌ చాలా పెద్దగా, అట్టహాసంగా, ‘తీయదలిచాడు. ఎంతగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలతో. సలీమ్‌గా దిలీప్‌ కుమార్‌ను తీసుకున్నాడు. అక్బర్‌గా పృథ్వీరాజ్‌ కపూర్‌ను. అనార్కలీగా మధుబాలా.

మధుబాలాకు ఇండియన్‌ మార్లిన్‌ మన్రో అని పేరు. ‘మహల్‌’తో ఆమె మెరిసినా,‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’, ‘చల్తీ కా నామ్‌ గాడీ’... ఆకర్షణగా నిలిచినా ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది.

మధుబాల క్లాసికల్‌ డాన్సర్‌ కాకపోయినా నాటి కథక్‌ ఆచార్యుడు కిష్షు మహరాజ్‌ దగ్గర నృత్యం నేర్చుకుని ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ పాటలో మెరుపు వేగంతో పాదాలను కదిలించింది. చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్‌ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరిచింది. మేరునగధీరుల వంటి పృథ్వీరాజ్‌ కపూర్, దిలీప్‌ కుమార్‌లను ఢీకొడుతూ నటించడం సామాన్యం కాదు. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్‌ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్‌ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్‌. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ. ఆమెది విఫల ప్రేమకథే. కాని బాక్సాఫీసు దగ్గర సఫలమైంది. ఆ ప్రేమకథ గెలుస్తూనే ఉంది నేటికీ.

మధుబాల దిలీప్‌ కుమార్‌ని ప్రేమించింది. దిలీప్‌కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని మధుబాల మీద ఆధారపడిన కుటుంబం ఆమె వివాహమయ్యాక దిక్కులేనిదవుతుందని మధుబాల తండ్రి దిలీప్‌కుమార్‌తో తగాదా పెట్టుకున్నాడు. కోర్టు గొడవలు దాకా వెళ్లింది. మనసు విరిగిన దిలీప్‌ ఆ తర్వాత మధుబాల ముఖం చూడలేదు. మొఘల్‌–ఏ– ఆజమ్‌లో నటించే సమయంలో వారి మధ్య మాటలే లేవు. కాని తెర మీద రొమాన్స్‌ను పండించారు. ఆ తర్వాత  గాయకుడు కిశోర్‌ కుమార్‌ మధుబాలను ప్రేమించినంత పని చేశాడు. వారి వివాహం జరిగాక సాగిన 9సంవత్సరాల కాపురం పెళుసైనది. గుండె జబ్బుతో బాధ పడుతున్న మధుబాలను కిశోర్‌ లండన్‌లో కూడా చూపించాడు. నయం కాదని తెలిశాక మృత్యువు తెచ్చే ఎడబాటును తట్టుకోవడానికి బహుశా ముందు నుంచే దూరమయ్యాడు. 

ఒక అందమైన సుందరి, కోమలమైన హృదయం గల స్త్రీ గుండె నిండుగా ప్రేమ పొందకనే మరణించింది. జీవించి ఉండగా, మరణించాక... నేటికీ ఎందరికో పోస్టర్‌గర్ల్‌గా గోడల మీద ఉంటున్న మధుబాల... తాను కోరుకున్న ప్రేమను, తన మనసు నింపే ప్రేమను పొంది ఉంటే మరికొన్నాళ్లు బతికి ఉండేదేమో. 
ప్రేమికుల రోజు జన్మించిన మధుబాల ప్రేమ ఉన్నంత కాలం ఒక గులాబీని ఆమె స్మరణలో పొందుతూనే ఉంటుంది ఏ అనామక అభిమాని నుంచో.

ఇష్క్‌ మే జీనా ఇష్క్‌ మే మర్‌నా
ఔర్‌ అబ్‌ హమె కర్‌నా క్యా
జబ్‌ ప్యార్‌ కియాతో డర్నా క్యా:

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)