Breaking News

నాడు జర్నలిస్ట్‌ నేడు ప్రధాన కార్యదర్శిగా..!

Published on Wed, 02/07/2024 - 17:36

ఐఏఎస్‌ సాధించడం చాలామంది కల. అందుకోసం ఏళ్లుగా ఓ తపస్సులా కృషి చేస్తారు. తాము అనుకున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటివి సాధించేంత వరకు  ప్రయత్నాలు సాగిస్తున్నే ఉంటారు. కానీ రాధ రాటూరి చేసిన సివిల్స్‌ ప్రయత్నాల్లో ప్రతీ ప్రయత్నం విజయవంతంగా గెలిచి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివరికి ఆమె కోరుక్నుట్లుగా ఐఏఎస్‌ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..

1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ అడ్మినస్ట్రేటివ​ సర్వీస్‌(ఐఏఎస్‌ ) అధికారి ఉత్తరాఖండ్‌ తొలి మహిళా కార్యదర్శిగా గత వారమే నియమితులయ్యారు. జనవరి 31తో సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో సీనియర్‌ అధికారిణి రాధ రాటూరిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం. ఆమె భర్త అనిల్‌ రాట్రూయ్‌ నవంబర్‌ 2020లో ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌(ఐపీఎస్‌) నుంచి ఉత్తరాఖండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు.  ఇక ఆమె తండ్రి కూడా సివిల్‌ సర్వెంట్‌గా పనిచేయడం విశేషం.

ఆమె ఎడ్యుకేషన్‌ నేపథ్యం వచ్చేటప్పటికీ..1985లో ముంబైలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్‌ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్‌ కూడా పూర్తి చేసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఏ చేసింది. అనంతరం ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ బొంబాయి ఎడిషన్‌లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం ఇండియా టు డేలో కూడా జర్నలిస్టుగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువతో సివిల్‌ సర్వీస్‌ వైపుకి రావడం జరిగింది. ఐతే తొలి ప్రయత్నంలో ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌​ సర్వీస్‌ ఆపీసర్‌ ఉద్యోగాన్ని సాధించారు.

ఆ తర్వాత మరో ప్రయత్నంలో ఐపీఎస్‌ని కూడా సాధించారు. అక్కడితో ఆగక మూడో ప్రయత్నంలో ఆమె కోరుకున్నట్లుగా ఐఏఎస్‌లో చేరాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇలా సివిల్స్‌లో వరుస ప్రయత్నాల్లో ఏదో ఒక క్యాడర్‌ సాధిస్తూ.. పోయిన వ్యక్తిగా రాధ రాటూరి నిలవడం విశేషం. తొలుత ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించినా.. యూపీ కేడర్‌కు బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థన మేరకు తొలి పోస్టింగ్‌ గుజరాత్‌లోని టెహ్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఐఏఎస్‌ అధికారిగా కెరియర్‌ని ప్రారంభించి.. అలా పదేళ్ల పాటు ఉత్తరాఖండ్‌ ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాధ రాటూరి అదే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫిసర్‌గా నియమితులయ్యారు. అంతేగాదు ఉత్తరాఖండ్‌​ రాష్ట్రంలో అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్‌ పదవిని అలంకరించిన తొలి మహిళగా కూడా రాధ నిలిచారు. 

(చదవండి: ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్‌ అధికారిగా!)

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)