Breaking News

అంజీర్‌ పండ్లే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు

Published on Wed, 03/06/2024 - 10:46

అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గానూ కూడా  వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని  అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. 

అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. 

అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ  చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు  రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్‌గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్‌  లెవల్స్‌) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి,  గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను  నియంత్రణలో  ఉంచుకోవచ్చని  ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్‌ ఆకుల్లోని  ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అంజీర్‌ ఆకులతో టీ
వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ  నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే  రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి.

ఎండబెట్టి పొడి చేసుకుని
అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు.

అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు  గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.  ఈ ఆకుల కషాయం  లేదా టీతో  గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్‌ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

టీబీ నివారణలో
అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే  మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)