కొత్తగా లైప్‌ స్టార్ట్‌ చేయడం కోసం..రూ.1.45 కోట్లు ఆర్జించే ఉద్యోగానికి గుడ్‌బై! కట్‌చేస్తే..

Published on Thu, 10/29/2026 - 16:40

బతికి ఉంటే కోట్లు ఆర్జించొచ్చు గానీ..ఆరోగ్యమే లేకపోతే..ప్రాణమే ఉండదు. అందుకే కోట్ల సంపాదన కంటే ఆరోగ్యమే ప్రదానమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పుడు ఆ సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ 55 ఏళ్ల మహిళ. ఓ వయసు వచ్చాక డబ్బు వెంట పరిగెత్తకూడదని తనదైన శైలి వివరించి..అందర్నీ ఆలోచింప చేసింది. పైగా ఆర్థిక భద్రతకంటే ప్రశాంత జీవితమే మిన్నా తేల్చి చెప్పింది.

ఆ మహిళే అమెరికాకు చెందిన సెంట్‌మనాట్‌. ఫ్లోరిడాలో నివశిస్తున్న ఈ మహిళ హైస్కూల్ చదువుని మధ్యలోనే వదిలేసింది. సింగిల్‌ మదర్‌ పెంపకంలో పెరిగిన సెంట్‌మనాట్‌ ఆరు అంకెల జీతాన్ని సంపాదిస్తానని ఎప్పుడు అనుకోలేదామె. తనకు కుమార్తెలు పుట్టాక అధిక బరువుతో ఇబ్బంది పడింది. 

ఆ క్రమంలోనే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఉన్న అభిరుచి ఆధారంగా పర్సనల్‌ ట్రైనర్‌గా మారి మంచి వ్యాపారాన్ని నిర్మించుకుంది. అయితే కరోనా కారణంగా ఆ స్టూడియోని మూసివేయవలసి వచ్చింది. ఆంక్షలు ఎత్తిన తర్వాత వ్యాపారాన్ని పునర్నిర్మించడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. ఆ సమయంలో స్నేహితురాలు రేస్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం ఇచ్చింది. అందుకు కావల్సిన సర్టిఫికెట్లను సంపాదించి మరి రేస్‌ డైరెక్టర్‌గా మొత్తం ఐదు ఈవెంట్లను నిర్వహించింది. ఈ ఉద్యోగం సంతృప్తినిచ్చినప్పటికీ విపరీతమైన ఒత్తిడితో కూడుకున్నది. 

అదికాస్తా ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి..పనికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకు వచ్చింది. చివరికి ఆ స్ట్రెస్‌ ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టింది. ఇది గమనించి టీనేజ్‌ కుమార్తెలు ఆమెను కొంతకాలం జాబ్‌కి విరామం ఇవ్వమని సూచించారు. అలా చేసినా.. తనలో అంతగా మార్పు రాకపోయేసరికి ఉద్యోగమే వదిలేసి కొత్తగా లైఫ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంది. అలా ఆమె రేసు డైరెక్టర్‌గా ఏడాదికి రూ. 1.45 కోట్లు ఆర్జించే ఉద్యోగాన్ని వదలుకుంది. 

నిజానికి మరో ఏడాది ఉద్యోగంలో కొనసాగి ఉంటే ఆమె జీతం ఏకంగారూ. 1.7 కోట్లు పెరిగేది. అయితే ఆమె ఉద్యోగానికి రిజైన్‌ చేసి అడవిలో వెళ్లి కొత్తగా లైఫ్‌ని మొదలు పెట్టింది. అక్కడ ప్రకృతితో మమేకమవ్వడం ఆమెకు స్వస్థత చేకూర్చి, ఓదార్పుని అందించింది. అంతేగాదు మళ్లీ ఒక లక్ష్యం, అభిరుచితో సాగాలనే స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని అందించిందామెకు. పైగా తనకు ప్రకృతిలో సేద తీరడమే సరైన మందు అని ముందే తెలుసు అని నవ్వుతూ చెబుతోంది. 

అలా ఆమె 'వై నాట్ వైల్డ్' అనే సంస్థను ప్రారంభించింది. ఇది దక్షిణ ఫ్లోరిడాలో వ్యక్తిగత అనుభవాల ద్వారా ప్రజలు ప్రకృతితో తిరిగి అనుబంధం పెంచుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ టూర్ ప్యాకేజీలను అందించే బదులు, ఆమె కార్యకలాపాలను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తుంది. వీటిలో ఎవర్‌గ్లేడ్స్‌ గుండా హైకింగ్ చేయడం, నీటిలో నడవాల్సిన దారులలో ప్రయాణించడం, హైకింగ్ ఇష్టపడని వారి కోసం మోటార్‌సైకిల్ సాహసయాత్రలు వంటివి ఉంటాయి. అంతేగాదు ప్రజలు తమ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా సోషల్‌మీడియా ద్వారా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది కూడా. 

అయితే ప్రస్తుతం దీని ద్వారా ఆదాయం సున్నా అయినా..ప్రశాంత ఫుల్‌ అని చాలా సంతోషంగా చెబుతోంది సెంట్‌మనాట్‌. కానీ అధిక ఆదాయం ఇచ్చే ఉద్యోగం వదులుకోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. కుటుంబం తనకు పూర్తిగా మద్దతిస్తుందని అంటోంది. తన కొత్త వ్యాపారం అంతగా మంచి ఆదాయం ఆర్జించనప్పటికీ..ప్రతిరోజూ నూతనోత్సాహంతో లేవగలుగుతున్నా అని అంటోంది.

ప్రస్తుతం ఆదాయం పరంగా నిల్‌ కానీ మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప అనుభూతిని మాత్రం పొందానని చెబుతోంది. అంతేగాదు..ఒక వయసు వచ్చేటప్పటికీ డబ్బు వెంట పరుగులు తీయకుండా నెమ్మదించడం అవసరం అనే సత్యాన్ని నొక్కి చెప్పడమే గాక ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం ఎలాగో చాటి చెప్పింది తన లైఫ్‌స్టైల్‌తో.  

ఇదీ చదవండి: అందాల ప్రమాణాలను తిరగరాస్తూ..సరికొత్త అర్థం ఇచ్చింది ఈ సీతమ్మ!

 

#

Tags : 1

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)