Breaking News

నాజూకు నడుము కోసం మరీ ఇలానా..!

Published on Fri, 01/17/2025 - 15:12

వెర్రి వెయ్యి రకాలంటే ఇదేనేమో. ఇటీవల కాలంలో అందం పిచ్చి మాములుగా లేదు. అందుకోసం ప్రాణాలే సంకటంలో పడేసే పనులు చూస్తే ఏం మనుషుల్రా బాబు అనిపిస్తుంది. అచ్చం అలాంటి భయానకమైన పనే చేసేంది ఓ ట్రాన్స్‌ విమెన్‌. ఆమె చేసిన పని తెలిస్తే.. అందం కోసం మరీ ఇంతకు తెగించాలా అని చిరాకుపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

అమెరికాకు చెందిన  27 ఏళ్ల ట్రాన్స్‌ మహిళ(Trans Woman) ఎమిలీ జేమ్స్‌(Emily James) నడుము నాజూగ్గా ఉండాలని పక్కటెముకలు(Ribs) తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఏకంగా రూ. 1 లక్షలు ఖర్చు పెట్టి మరీ సర్జరీ చేయించుకుంది. దీని కారణంగా వర్ణనాతీతమైన బాధను కూడా అనుభవించింది. 

ఇలా ఎముకలు తొలగించుకోవడం వల్ల విపరీతమైన వాపు వచ్చి కార్సెట్‌(బెల్ట్‌)ను ధరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. అంతేగాదు  తనకు ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సుల బృందానికి ధన్యవాదాలు చెప్పినట్లు తెలిపింది. అలాగే తొలగించిన పక్కటెముకలను వైద్యులు తనకే ఇచ్చేసినట్లు పేర్కొంది. పైగా వాటిని కిరీటం(crown) కింద ఎవరైన తయారు చేస్తే బాగుండనని అంటోంది. 

అంతేగాదు దాన్ని తన ప్రాణ స్నేహితుడికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా చెప్పింది. తాను బార్బెక్యూలా అందంగా కనిపించాలని గత మూడు రోజుల క్రితం రెండు వైపులా పక్కటెముకలు తొలగించుకున్నానని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో నెటిజన్లు అందం కోసం మరి ఇలానా అంటూ తిట్టిపోయగా, మరికొందరూ ఆ ఎముకలను ఏం చేస్తావంటూ వెటకారంగా కామెంట్‌లు చేస్తూ పోస్టులు పెట్టారు.

గతంలో ఇలానే అందం కోసం చేయించుకున్న కాస్మెటిక్‌ సర్జరీల కారణంగా చాలామంది మోడల్స్‌, స్టార్‌లు అనారోగ్యం పాలవ్వడం లేదా వికటించి బాధలు పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయినా ఈ గ్లామర్‌ పిచ్చి జనాలకు తగ్గడం లేదు ఎందుకనో..?. నిజానికి ఆరోగ్యానికి మించిన అందం ఇంకేమైనా ఉందా..! అని ఆలోచించండి ప్లీజ్‌..!.

(చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్‌ తెలిస్తే కంగుతింటారు..!)
 

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)