Breaking News

రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’.. అంతా గాల్లోనే

Published on Fri, 06/30/2023 - 17:40

మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్.

అతను 1999లో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్‌ పాస్‌ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్‌ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్‌ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్‌ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్‌ సూట్‌లు, క్రిస్ట్‌ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్‌ దిన్‌ సుల్తాన్‌’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్‌ బుక్‌ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్‌లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి.

అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్‌ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో  ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం.
(చదవండి: వాట్‌ యాన్‌ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!)

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)