Breaking News

'ఇది కాస్మెటిక్‌ సర్జరీనే కానీ క‍ళ్లకు'..ఎంత ఛార్జ్‌ చేస్తారో తెలుసా..!

Published on Fri, 01/31/2025 - 13:26

మహిళలు కాస్మెటిక్‌ సర్జరీలతో అందాన్ని రెట్టింపు చేసుకుంటుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, ప్రముఖులే వీటిని చేయించుకుంటుంటారు. ఓ మోస్తారు స్థాయిలో డబ్బున్న వాళ్లు చేయించుకునే సర్జరీలివి. ఇంతవరకు బ్రెస్ట్‌, పెదాలు, ఫేస్‌లిఫ్ట్‌లు, బోటాక్స్‌ వంటి కాస్మెటిక్‌ సర్జరీల గురించి విన్నాం. కానీ కంటికి  కాస్మెటిక్‌ సర్జరీలు చేయడం గురించి వినలేదు కదా..!. ఇదేంటి కంటికి ఏం చేస్తారు అనుకోకండి. ఎందుకంటే నీలిరంగు, తేనె కళ్లతో ఉండేవాళ్లని చూస్తుంటాం కదా..! అలా మన కళ్లను నచ్చిన రంగుతో అందంగా మార్చుకునే సర్జరీనే ఇది. అయితే దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసా..!.

యూఎస్‌కి చెందిన డాక్టర్‌(US Doctor) బ్రియాన్‌ బాక్సర్‌ వాచ్లర్‌(Dr Brian Boxer Wachler) ఈ వినూత్న కాస్మెటిక్‌ సర్జరీ(cosmetic surgery)నే చేస్తున్నారు. ఇలా కంటి రంగుని మార్చడాన్ని కెరాటోపిగ్మెంటేషన్‌ సర్జరీగా పిలుస్తారు. కార్నియాలోకి వర్ణద్రవ్యాన్ని ఇంజెక్ట్‌ చేసి కంటి రంగుని మార్చే ప్రక్రియ ఇది. దీనికి జస్ట్‌ 15 నుంచి 20 నిమిషాలుపడుతుంది అంతే..!. ఈ కార్నియాకి ఇచ్చే ఇంజెక్షన్‌లో ఈ ఐ డ్రాప్స్‌ తిమ్మిరిని కలుగజేస్తాయి. 

అందువల్ల నొప్పి కూడా అస్సలు తెలియదు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలాంటి నొప్పి లేకుండా చేసే ఈ సర్జరీ ఖరీదు మాత్రం అత్యధికమే. ఒక కంటికి సుమారు రూ. 5 లక్షల దాక అవుతుంది. అంటే రెండు కళ్లకు దగ్గర దగ్గర రూ. 10 లక్షలు పైనే ఖర్చు అవుతుందన్న మాట. ఈ సర్జరీ రిజల్ట్‌ తక్షణమే కనిపిస్తుంది. చాలామంది ఔత్సాహికులు మాత్రం ఆకుపచ్చ, సతత హరిత, రివేరా నీలం, పారిస్ నీలం వంటి రంగులను ఎంచుకుంటారట. ఎక్కువమంది హనీ గోల్డ్, స్టీల్ గ్రే, ఆలివ్‌ ఆకుపచ్చలకే ప్రాధాన్యత ఇస్తారట. 

తన పేషంట్లలలో చాలామంది ఈ సర్జరీ చేయించుకున్న వెంటనే తన కళ్లలోని మార్పుని చూసి ఆశ్చర్యపోవడం, కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగంగా మాట్లాడటం వంటివి చేస్తారని డాక్టన్‌ బ్రయాన్‌ చెబుతున్నారు. అయితే తాను మాత్రం ఈ సర్జరీని ట్రై చేయాలని అనుకోవడం లేదని అన్నారు. కేవలం అందం కోసం ఆరాటపడే వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఈ సరికొత్త కాస్మెటిక్‌ సర్జరీ ప్రక్రియని కనుగొన్నట్లు తెలిపారు. 

ఆధునాతన లేజర్‌ని ఉపయోగించి ఈ మొత్తం కాస్మెటిక్‌ సర్జరీని పూర్తి చేస్తానని అన్నారు. ఇది చాలా సురక్షితమైనదని పేర్కొన్నారు. అంతేగాదు తన పేషంట్ల అనుభవాలకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఈ సర్జరీ గురించి వివరించారు. అయితే నెటిజన్లు ఈ అందం పిచ్చి రాబోయే రోజుల్లో ఎలాంటి భయానక కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకునేందుకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ.. చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఇద్దరు నారీమణుల సాహసం..భూగోళాన్ని చుట్టొచ్చారు..!)

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)