Sperm Race ఇది రొటీన్‌ రేస్‌ కాదు! సమ్‌థింగ్‌ స్పెషల్‌!

Published on Thu, 04/24/2025 - 12:00

ఈ నెల 25న ప్రపంచంలోనే తొలిసారిగా లాస్‌ ఏంజిల్స్‌లో ‘లైవ్‌ స్పెర్మ్‌ రేస్‌’ జరగనుంది. జీవనశైలిలో మార్పులు... మొదలైన వాటివల్ల పురుషుల్లో పెరుగుతున్న సంతాన లేమి అనే క్లిష్టమైన సమస్యపై ఈ రేస్‌ దృష్టి సారిస్తుంది.

‘ఎవరి స్పెర్మ్‌ హెల్తీయెస్ట్‌? ఫాస్టెస్ట్‌?’ అనే దానిపై జరిగేపోటీ ఇది. పోటీ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే... నిజమైన స్పెర్మ్‌తో కూడిన రేస్‌ ఇది. మానవ ప్రత్యుత్పత్తి మార్గాన్ని అనుసరించేలా మైక్రోస్కోపిక్‌ రేస్‌ ట్రాక్‌ రూపొందించారు. సింక్రనైజ్డ్‌ స్టార్టర్‌లతో రసాయన సంకేతాలు, ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ కోర్సు ద్వారా స్పెర్మ్‌ నమూనాలు ఈత కొట్టేలా చేస్తారు. ఈపోటీని యాక్షన్‌ హై–రిజల్యూషన్‌ కెమెరాతో రికార్డ్‌ చేస్తారు.  విజేతను నిర్ణయించడానికి మూడు రేసులు జరుగుతాయి. ప్లే–బై–ప్లే కామెంటరీ అలరిస్తుంది.ఇన్‌స్టంట్‌ రీప్లే, కామెంటరీ, గణంకాలు, లీడర్‌ బోర్డ్‌లు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను అభిమానులు ఆస్వాదించేలా చేస్తుంది.

ఈ రేస్‌లో బెట్టింగ్‌ కూడా ఉంటుంది!
అత్యంత వేగంగా ఈత కొట్టే స్పెర్మ్‌పై అభిమానులు పందెం కట్టవచ్చు. ‘ఏ లాఫ్‌ విత్‌ ఏ డీపర్‌ పర్పస్‌’ నినాదంతో ఈ రేస్‌కు శ్రీకారం చుట్టారు. యువ మిలియనీర్‌ల బృందం ఈ విచిత్ర పోటీని నిర్వహిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెల్త్, టెక్, ఎంటర్‌టైన్‌మెంట్‌లను మిళితం చేసి  రూపొందించిన రేస్‌ ఇది. ‘ఎవరూ టచ్‌ చేయని అంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా ఈ రేస్‌ను రూపొందించాం. ఇది పురుషుల సంతానలేమి గురించి ప్రజలు నిస్సంకోచంగా మాట్లాడుకునేలా చేస్తుంది’ అంటున్నారు పోటీ నిర్వాహకులు.

రేస్‌ ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ‘ఎక్స్‌’లో ‘ది స్పెర్మ్‌ ట్రాక్‌: నాట్‌ యువర్‌ యావరేజ్‌ రేస్‌’ టైటిల్‌తో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ రేస్‌లో  పాల్గొనే టీమ్‌లను కూడా పరిచయం చేశారు. రేస్‌ ఉద్దేశం గురించి ‘స్పెర్మ్‌ రేసింగ్‌ మేనిఫెస్టో’ కూడా విడుదల చేశారు. ఈ మైక్రోస్కోపిక్‌ బ్యాటిల్‌లో వీర్య విజేత ఎవరో వేచి చూద్దాం.
ఇది  చదవండి: స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)