మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : యూఎస్ ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్!
Published on Wed, 05/21/2025 - 15:43
సీనియర్ సిటిజనులను పట్టిపీడిస్తున్న అల్జీమర్స్ (Alzheimer )వ్యాధి నిర్ధారణలో కీలకమైన పురోగతి ఊరటగా నిలుస్తోంది. ఈ వ్యాధిని సహాయపడటానికి రక్తాన్ని పరీక్షించే పరికరం అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ రక్తపరీక్షను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదించింది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే తొలి ఇన్ విట్రో డయాగ్నస్టిక్ పరికరం కావడం విశేషం. ఈ ఏడాది జూన్‌నుంచి అమెరికాలో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్ కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త మెడికల్ టెస్ట్‌కు అమెరికాలోని ఎఫ్‌డీఏ గతవారమే ఆమోదముద్ర వేసింది. తద్వారా పెట్ స్కాన్‌లు వెన్నెముక ద్రవ విశ్లేషణలు లేకుండానే ఈ పరీక్ష ద్వారా30 నిమిషాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చు.
అల్జీమర్స్ ముందస్తు గుర్తింపు, సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. "అల్జీమర్స్ వ్యాధి చాలా మందిని ప్రభావితం చేస్తుందని, రొమ్ము క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ రెండింటి బాధితుకల ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని FDA కమిషనర్ మార్టిన్ ఎ మకారీ ఒక ప్రకటనలో తెలిపారు. 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 10 శాతం మందికి అల్జీమర్స్ ఉందని ,2050 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కొత్త వైద్య ఉత్పత్తులు రోగులకు సహాయ పడతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ చర్య రోగులకు ఈ వినాశకరమైన నాడీ సంబంధిత వ్యాధి పురోగతిని నెమ్మదింపజేసేలా, ముందుగానే చికిత్స ప్రారంభించడంలో ఇది సహాయ పడుతుంది. అలాగే ఖరీదైన, ఇన్వాసివ్ PET ఇమేజింగ్ లేదా కటి పంక్చర్ (lumbar punctures)ల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
పరీక్ష ఎలా పనిచేస్తుంది
ఫుజిరేబియో డయాగ్నోస్టిక్స్ అభివృద్ధి చేసిన లూమిపల్స్ రక్త పరీక్ష రక్తంలోని రెండు ప్రోటీన్ల నిష్పత్తిని కొలుస్తుంది. అమిలాయిడ్ 1-42 β-అమిలాయిడ్ 1-40 - ఈ రెండింటి నిష్పత్తి మెదడులోని అమిలాయిడ్ ఫలకాలతో పరస్పర సంబంధం కలిగి ఉంది.
ప్రస్తుత రోగనిర్ధారణ పద్ధతులతో పోలిస్తే అల్జీమర్స్ రక్త పరీక్ష చాలా వరకు ఖచ్చితంగా ఉంటుందని అంచనా. 499 మంది రోగులతో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో, ఈ పరీక్ష అధిక రోగనిర్ధారణ విశ్వసనీయతను ప్రదర్శించిందిసానుకూల ఫలితాలు వచ్చిన వారిలో 91.7 శాతం మందికి PET స్కాన్‌లు లేదా స్పైనల్ టాప్స్ లేకుండా అల్జీమర్స్-సంబంధిత ఫలకాలు నిర్ధారించినారు. ప్రతికూల ఫలితాలు వచ్చిన వారిలో 97.3 శాతం మందికి ఎటువంటి ఫలకాలు (plaques) లేవు.
జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గందరగోళం వంటి అభిజ్ఞా క్షీణత లాంటి ప్రారంభ సంకేతాలను చూపిస్తున్న 55 ఏళ్లు ,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం ఈ పరీక్ష ఉద్దేశించబడింది. అమెరికాలోని సర్టిఫైడ్ ప్రయోగశాలలలో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుందని ఫుజిరెబియో నిర్ధారించింది. ఇది నేరుగా రోగులకు అందుబాటులో ఉండదు. వైద్యుడి సిఫారసు అవసరం. అయితే ఇది భారతదేశంలో లేదా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పరీక్ష ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. అయితే, US డేటా ఆధారంగా ఇతర దేశాలలో నియంత్రణ ఆమోదాలు అనుసరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Tags : 1