Breaking News

ఆ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!

Published on Thu, 11/07/2024 - 17:35

సాధారణంగా కొందరికి ప్రయాణాలంటే ఒక విధమైన యాంగ్జైటీ ఉంటుంది.  దీంతో ఆందోళనగా చెమటలు పట్టేసి ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు. ఈ జర్నీ ఎప్పుడు పూర్తి అయ్యి ఇంటికి చేరుకుంటామా..! అని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఈ ఎయిర్‌పోర్ట్‌ ఒత్తిడిని దూరం చేసేలా లామా థెరఫీని అందిస్తుంది. ఇదేంటి అనే కదా..!

ఏం లేదండి మనకిష్టమైన వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను చూడగానే రిలీఫ్‌గా ఉంటుంది. ఏ విధమైన భయాందోళనలు దరిచేరవు. పైగా ధైరంగా ఉంటుంది. అలాంటి ఆలోచనతోనే లోరీ గ్రెగోరీ, షానన్ జాయ్చే అనే తల్లికూతుళ్ల బృందం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన థెరపీని అందిస్తుంది. 

ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేలా లామాస్, అల్పాకాస్ అనే ఒంటె జాతికి చెందిన జంతువులతో లామా అనే థెరపీని అందిస్తోంది. అలాంటి జంతువులు ఈ ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం ఐదు లామాలు, ఆరు అల్పాకస్‌లు ఉన్నాయి. వాటితో ఈ థెరపీని అందిస్తుంది. ఈ జంతువులు మెడలకు "ఐ హార్ట్ PDX" నెక్‌కర్చీఫ్‌లు, పాంపమ్ హెడ్‌బ్యాండ్‌లతో ప్రయాణికులకు దర్శనమిస్తాయి. అసలు ఇవి ఎలా ప్రయాణికులకు థెరపీని అందిస్తాయనే కదా సందేహం..

లామా థెరపీ అంటే..
ఏం లేదండి ఇవి అందంగా ముస్తాభై ఎయిర్‌పోర్ట్‌ అంత కలియతిరుగుతాయి. అక్కడకు వచ్చిన ప్రయాణికుల దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగతుంటాయి అంతే..!. అయితే ఆ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రయాణికులు.. వాటిని చూడగానే జర్నీ వల్ల కలిగిన యాంగ్జైటీ అంతాపోయి ముఖంపై చిరునవ్వు వస్తుందట. దీన్నే లామా థెరపీ అంటారు. 

ఆ ఒంటె జాతికి చెందిన జంతువుల పేరు మీదుగా ఆ థెరఫీకి పేరు పెట్టారు. అంతేగాదు అక్కడకు వచ్చిన ప్రయాణికులంతా వాటిని చూడగానే ప్రశాంతత వస్తుందని, సంతోషంగా ఉంటామని చెబుతున్నారట. దీన్ని ఎలాంటి లాభప్రేక్ష లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఆ తల్లి కూతుళ్లు నిర్వహించడం విశేషం.  అంతేగాదు విమానాశ్రయ ప్రతినిధి అల్లిసన్ ఫెర్రే ఈ జంతువుల కారణంగా ప్రయాణికుల ముఖాల్లో ఒత్తడి మాయం అయ్యి ప్రశాంతంగా కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు కూడా. 

ఈ పోర్ట్‌ల్యాండ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు శాంతియుత వాతావరణాన్ని అందించేలా సహజమైన కాంతిని అందించే లైట్లు, ఆహ్లాదభరితమైన అందమైన పూల కుండీలు తదితరాలతో టెర్మినల్‌ని రీ డిజైన్‌ చేశారట అక్కడ అధికారులు. అందులో భాగంగానే ఈ జంతువులను కూడా ఏర్పాటు చేశారట. ఇలా జంతువులతో సర్వీస్‌ అందించటం తొలిసారి కాదు గతంలో శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని "వాగ్ బ్రిగేడ్"లో డ్యూక్ అనే 14 ఏళ్ల పిల్లిని కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారట. ఆ పిల్లి  పైలట్ టోపీ  చొక్కా కాలర్ ధరించి ప్రయాణికుల ఆందోళన భయాలను పోగొట్టేలా ఆ ఎయిర్‌పోర్ట్‌లో కలియతిరుగుతుండేదట.

 

(చదవండి: కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..)

 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)