Breaking News

ట్రెడిషన్‌ విత్‌ ట్రెండ్‌..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్‌

Published on Wed, 04/30/2025 - 17:38

నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) సరికొత్త ఫ్యాషన్‌తో  అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది.  ప్రముఖ డిజైనర్‌ మనీహ్‌ మల్హోత్రా (Manish Malhotra) డిజైన్‌ చేసిన చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌  చేసింది. దీంతో అద్భుతం అంటూ ఫ్యాన్స్‌  సందడి చేస్తున్నారు.

ట్రెడిషన్‌ విత్‌ ట్రెండ్‌ అనేలా ఊర్మిళ మతోండ్కర్ మనీష్ మల్హోత్రా రోజ్ గోల్డ్ చీరలో ట్రెండీ లుక్‌లో అదిరిపోయింది.  ఇందులో అనేక సీక్విన్లు ఉండటం విశేషంగా  నిలిచింది. ఆరు గజాల చీర, అందమైన జాకెట్లు మాత్రమే కాదు, అంతకంటే భిన్నంగా అలంకరించుకుని ఆధునిక పద్ధతిలో స్టైలిష్‌గా కనిపించవచ్చు అని ఊర్మిళ రుజువు చేస్తోంది. మనీష్ మల్హోత్రా  సిగ్నేచర్‌ స్టైల్‌లో ఊర్మిళ, చీరకు జతగా  సాధారణ బ్లౌజ్‌ను వదిలివేసి, దానికి బదులుగా సమకాలీన కార్సెట్ టాప్‌ను ఎంచుకుంది. శరీరానికి సరిగ్గా అతుక్కునేలా శిల్పంలాటి ఆకృతిలో, నడుము ఒంపులను ప్రదర్శిస్తూ స్ట్రాప్‌లెస్ నంబర్ ఫిట్‌తో వచ్చింది.  పల్లూను దుపట్టా లాగా వెరైటీగా చేతిపై కప్పుకుని ఫ్యాషన్‌కి కొత్త అర్థం  చెప్పింది. నడుము దగ్గర 3D పూల అప్లిక్‌ వర్క్ మొత్తం లుక్‌కు రొమాంటిక్ ఫ్లెయిర్‌ను జోడించింది.

 షీర్ ఫాబ్రిక్ తో తయారు చేసిన చీరను అంచుల చుట్టూ మల్టీ సీక్విన్స్ తో షైనీగా ఉంది. అల్టిమేట్ కాక్‌టెయిల్ ఎంసెంబుల్ కోసం ప్రేరణ కోరుకునే ఫ్యాషన్ ఔత్సాహికులందరూ వావ్‌ అంటున్నారు. డైమండ్‌ ఆభరణాలు,తన జుట్టును వా లుగా వెనక్కి వదిలేసి10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్‌ను జోడించినట్టు తెలిపారు.   రంగీలానుంచి చీరలపై అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు.  స్లిక్ లుక్‌లో స్టైల్ చేసింది. అటు మనీష్‌ మల్హోత్రా  కూడా ఊర్మిళ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. 10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్‌ను జోడించినట్టు తెలిపారు.   రంగీలానుంచి ఇప్పటిదాకా చీరలపై తమ అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు.

కాగా బాలీవుడ్‌లో క‌ర్మ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్మిళ. రామ్ గోపాల్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో అంతం సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యింది. కుర్రకారు మనసును ఇట్టే దోచేసింది.   ఆ తరువాత  అన‌గ‌న‌గా ఒక‌రోజు, రంగీలా, స‌త్య చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకుంది.త‌నకంటే వ‌య‌సులో 10 ఏండ్లు చిన్నవాడు అయిన మోడల్‌ మోసిన్‌ అక్తార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ  గత ఏడాది ఆమె భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ నుండి విడాకులకు దరఖాస్తు  చేసినట్లు నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు వెలువడిన సంగతి తెలిసిందే.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)