Breaking News

బ్రెస్ట్‌ కేన్సర్‌: గుర్తించండి.. పోరాడండి..

Published on Thu, 06/12/2025 - 12:45

ఈ మధ్య సర్వ సాధారణంగా మారిన రొమ్ము కేన్సర్‌ను ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ ఫ్యూజీఫిల్మ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక ప్రచార కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెల ప్రారంభించారు. 

అపోలో ఫౌండేషన్‌ అమలు చేస్తున్న ఈ ప్రచారాన్ని హైదరాబాద్‌ నగరంలోని ఐటీసీ కోహినూర్‌ వేదికగా బుధవారం దీనిని ప్రారంభించారు. ఉపాసన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యుత్తమ సేవలను అందించడమే కాకుండా.. బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటి రోగాలను ముందుగా గుర్తించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 

సరైన అవగాహన, తగిన సమాచారం, సత్వరగా చికిత్సకు వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఫ్యూజీఫిల్మ్‌ ఇండియా చేపట్టిన ఈ సీఎస్‌ఆర్‌ ప్రచారం ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్‌ వారి జాతీయ కేన్సర్‌ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం రోగాల్లో 14 శాతం ఇదే ఉంటోంది. 

ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫ్యూజీఫిల్మ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోజి వాడా ఈ ప్రచార వివరాలు వెల్లడించారు. దేశంలోని 24 నగరాల్లో, శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఈ ప్రచారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.  

(చదవండి: డెట్రాయిట్‌లో 'తెలుగు పల్లెవంట')

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)