Breaking News

పేద పిల్లల రిచ్‌ ఫ్యాషన్‌

Published on Wed, 11/27/2024 - 00:23

లక్నోలోని నిరుపేద పిల్లలు ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి స్ఫూర్తితో పెళ్లి దుస్తులను రూపొందించారు. ఈ విషయాన్ని సూచిస్తూ తీసిన వీడియోను ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. వారు రూపొందించిన బ్రైడల్‌ వేర్‌ను ధరించి, మోడలింగ్‌ చేసిన వాళ్లలోనూ పేద పిల్లలూ ఉన్నారు.ఫ్యాషన్‌ పరిశ్రమపై సబ్యసాచి ముఖర్జీ ప్రభావం అతని అద్భుతమైన డిజైన్ లకు మించి విస్తరించింది. దీంతోపాటు భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ హస్తకళనూ ్రపోత్సహిస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ ఛేంజ్‌’ మార్గదర్శకత్వంలో సబ్యసాచి కళాఖండాలు, అతని దిగ్గజ డిజైన్ లు ఇప్పుడు లక్నోలోని నిరుపేద పిల్లల బృందానికి స్ఫూర్తినిచ్చాయి. 

ఈ నిరుపేద యువ డిజైనర్లు సగర్వంగా తమ క్రియేషన్ లను ధరించి కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో పోజులిచ్చారు. ’మేం లక్నో ఆధారిత ఎన్జీవోతో కలిసి 400 మంది నిరుపేద పిల్లలతో కలిసి పని చేస్తున్నాం. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ దుస్తులను మా విద్యార్థులు రూపొందించారు. ఇందులో ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల నుండి వచ్చినవారే. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్‌ దుస్తులను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులు, చుట్టుపక్కల వ్యక్తుల నుండి స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందే అన్ని దుస్తులను రీయూజ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు.

 సబ్యసాచి సోషల్‌ మీడియా అకౌంట్‌లో మోడల్‌ దుస్తులను చూసిన తర్వాత వారు ఇలాంటి డిజైన్స్‌ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ఇన్నోవేషన్‌ ఫర్‌ ఛేంజ్‌ ఎన్జీవో తెలిపింది. ప్రతిరోజూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శ్రద్ధగా కృషి చేస్తున్న 15 ఏళ్ల ఉత్సాహవంతమైన పిల్లలు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రఖ్యాత డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ  కామెంట్స్‌ విభాగంలో హార్ట్‌ ఎమోజీని పోస్ట్‌ చేయడం ద్వారా వారికి తన ఆశీస్సులను, ప్రశంసలను అందజేశాడు. అంతేకాదు, ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ‘ఈ పిల్లలకు మరింత శక్తి... ప్రేమ, ఆశీర్వాదాలు అందాలి..’ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)