Breaking News

సౌందర్యమైన ‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో! ఎలా చేసుకోవాలి?

Published on Fri, 07/05/2024 - 15:22

ఆధునిక కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. పోషకాలతో నిండిన ఆహారం, పానీయాలు, హెర్బల్‌టీ పై శ్రద్ధ  పెరిగింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువును అదుపులోఉంచుకునే హెర్బల్‌ టీల గురించి తెలుసుకుంటున్నారు. మరి అపరాజిత పువ్వులు, ఈ పువ్వులతో తయారు చేసుకునే ‘బ్లూ టీ’ ప్రయోజనాలు గురించి తెలుసా? తెలుసుకుందాం రండి!

అపరాజిత, వీటినే శంఖుపుష్కాలు , బటర్‌ఫ్లై  పీ అని కూడా అంటారు. తెలుగు, నీలం, ముదురు నీలం రంగుల్లో ఈ పూలు పూస్తాయి.  ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ‘బ్లూ టీ’ గా పాపులర్‌ అయిన ఈ టీతో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. 

పలు వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అపరాజిత ప్రస్తావన ఉంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం  కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటిథ్రాంబోటిక్ లక్షణం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.  తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్లూటీ తయారీ
నాలుగు నీలిరంగు అపరాజిత పువ్వులను తీసుకొని ఒక కప్పు నీళ్లలో బాగా మరిగించాలి.  నీళ్లు నీలం రంగులోకి మారతాయి. తరువాత, దీన్ని ఒక కప్పులోకి ఫిల్టర్‌ చేసుకొని హనీ, లేదా పంచదార,  నిమ్మకాయ కలపుకుని తాగవచ్చు.  ఇందులో తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)