Breaking News

విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్‌లో..

Published on Sun, 05/31/2026 - 13:43

కొందరు కేవలం పర్యాటనలకు వెళ్లి వచ్చేయరు. పర్యావరణ స్ఫూర్తిని రగిలించే ఆలోచింప చేస్తారు. అందుకు దేశం, సరిహద్దుతో పనిలేదు. మంచి మనసు, తనవంతుగా పర్యావరణానికి మేలు చేయాలన్న దృక్పథం చాలు అని నిరూపిస్తున్నాడు ఈ విదేశీయుడు. అంతేగాదు అతడి చర్యకు అక్కడి ప్రభుత్వం స్పందించి కదలివచ్చింది కూడా.

పర్యావరణ బాధ్యతకు ఉదాహరణగా నిలుస్తూ..అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు బ్రిటన్‌కు చెందిన మార్క్‌. ఆయన ఉత్తరాఖండ్‌లోని కాసర్‌ దేవి ప్రాంతంలో అటవీ మార్గాలు, పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నిశబ్దంగా ఏరుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సంచులు చేత బట్టుకుని సుందరమైన కొండ ప్రాంతంలో పడి ఉన్న ప్లాస్టిక్‌ను, చెత్తను ఏరుతూ కనిపించాడు. 

అక్కడి స్థానికుల ప్రకారం..మార్క్ చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడట. పైగా పరిశుభ్రతను తన వ్యక్తిగత దినచర్యగా మార్చుకున్నాడని చెబుతున్నారు. అతను ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు సమీపంలోని అటవీ ప్రాంతాలను కాలిబాటను శుభ్రం చేస్తూ..ఆ ప్రాంత సహజ సౌందర్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతని కృషి ఆన్‌లైన్‌లో విశేష ప్రచారం పొందింది.  అతడు చేస్తున్న పని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పిందని అక్కడకి వస్తున్న పలువురు పర్యాటకులు చెబుతుండటం విశేషం.

అంతేగాదు అతడొ చొరవకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఫిదా అవ్వతూ అతడిని అభినిందించింది. అలాగే అతడికి అన్ని విధాల మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అంతేగాదు అక్కడి అధికారులు పర్యావరణం, పరిశుభ్రత విషయాల్లో అవగాహన కల్పించడంలో సానుకూల ఉదహారణగా నిలిచాడని ప్రశంసించారు. అంతేగాదు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత పట్ల విద్యార్థులను, యువతను ప్రేరేపించే విధంగా మార్క్‌ను ఒక "మార్పు కారకుడిగా" ప్రోత్సహించాలని పరిపాలన యంత్రాంగం భావిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

 

(చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..)
 

Videos

తెలంగాణకు భారీ వర్ష సూచన

మనిషివి చూస్తే.. ఒక పనికిమాలిన డిప్యూటీ స్పీకర్ పోస్ట్..

భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!

వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు

ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవాలా..!

తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు

ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ భీకర యుద్ధం..

బీజేపీకి అన్నామలై రాజీనామా..

కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా!

ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!?

Photos

+5

చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)

+5

'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)

+5

'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు)

+5

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు

+5

చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)

+5

అల్లు స్నేహా.. మే జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు)

+5

విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)