Breaking News

చిన్న ప్యాకెట్‌ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!

Published on Tue, 12/10/2024 - 10:29

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్‌ లిమిటెడ్‌ అనే స్టార్టప్‌ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్‌స్టంట్‌ టీ బ్యాగ్‌ అంత సైజు ఉండే పౌడర్‌  ప్యాకెట్‌  కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్‌ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్‌ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్‌ఎఓ ఇన్నోవేషన్‌ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. 

శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్‌ డి’ అనే ఎంజైమ్‌ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్‌ సంస్థ రూపొదించిన పౌడర్‌ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం  పాటు తాజాగా ఉంచుతుంది.

టీ బ్యాగ్‌ అంతటి చిన్న ప్యాకెట్‌ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్‌ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్‌ఎఓ డైరెక్టర్‌ జనరల్‌ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్‌ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు