Breaking News

ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం

Published on Sun, 03/01/2026 - 15:01

రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్‌లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.

కుటుంబం మీదే ఎందుకు?
ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్‌ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్‌కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.

నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.

కుటుంబానికి విముక్తి ఎలా? 
1.    Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.
2.    Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్‌తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.
3.    ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.
4.    "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.
5.    కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.

మీ కోసం ఒక చిన్న పరీక్ష...
ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"

కెరీర్‌లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.

సైకాలజిస్ విశేష్
కెరీర్ & మైండ్‌సెట్ కోచ్
8019 000066
www.psyvisesh.com

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)