Breaking News

టైప్ 2 డయాబెటిస్‌కి మొక్కల ఆధారిత ఔషధం..!

Published on Wed, 03/05/2025 - 18:17

దేశంలో ఎక్కువ మంది టైప్‌2డయాబెటిస్‌(Type2Diabetes)తోనే బాధపడుతున్నారు. గణాంకాలు సైతం ఆ వ్యాధి బాధితులు ఏటా వేలల్లో ఉంటున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న మందులన్నీ ఈ వ్యాధిని అదుపులో ఉంచుతాయే తప్ప. పూర్తిగా నివారించలేవు. ఆ దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొంత పురోగతిని సాధించారు. తాజా అధ్యయనంలో టైప్‌2 డయాబెటిస్‌కి చెక్‌పెట్టే సరికొత్త ఔషధాన్ని తయారు చేశారు. ఇది రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సత్ఫలితాలనందించి, డయాబెటిస్‌ రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. మరీ ఆ ఔషధం విశేషాలేంటో చూద్దామా..!.

బెర్బెరిన్ అనేది వివిధ మొక్కలలో సహజంగా లభించే ఆల్కలాయిడ్. దీన్ని సాంప్రదాయ చైనీస్‌లో జీర్ణ సమస్యలు, వాపు, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వాళ్లు దీన్ని శతాబ్దాలుగా వివిధ రకాల చికిత్సకు ఉపయోగిస్తన్నారు. దాంతోనే టైప్‌2డయాబెటిస్‌ ఔషధాన్ని తయారు చేశారు చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పీపుల్స్ హాస్పిటల్ పరిశోధకులు. 

మొక్కల్లో లభించే బెర్బెరిన్ ఉత్పన్నం అయినబెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్ ఔషధాన్ని తయారు చేశారు. ఇక టైప్‌ 2 డయాబెటిస్‌ అనేది ఇన్సులిన్ నిరోధకత వల్ల సంభవిస్తుంది, ఇక్కడ శరీరం ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు సరిగా స్పందించదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ అమాంతం పెరుగుతుంది. అయితే దీనికి కేవలం రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను సాధారణ స్థాయికి తగ్గించే మందులు వాడుతూ..ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడమే మార్గం. 

నిజానికి ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడానికి బెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్, లేదా HTD1801ని కనుగొన్నారు. అయితే ఫేస్‌ 2 ట్రయల్స్‌లో ఊహించని విధంగా టైప్‌ 2 డయాబెటిస్‌ని కూడా సమర్థవంతంగా ప్రభావితం చేసి గణనీయంగా తగ్గించింది. అంతేగాదు ఆ అధ్యయనంలో ఇది కాలేయ కొవ్వు శాతంతోపాటు రక్తంలోని గ్లూకోజ్‌ నియంత్రణను గణనీయంగా మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు. 

ఇక్కడ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అనేది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను కొలిచే మార్కర్‌. అయితే ఆ ట్రయల్స్‌లో ఆహారం, వ్యాయామంతో తగినంతగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గని ఈ టైప్‌2 డయాబెటిస్‌ రోగుల్లో మాత్రం గణనీయమైన ప్రభావం చూపింది. వారిలో ఈ HTD1801 ఔషధం ప్రభావాన్ని అంచనా వేయగా..కొందరికి దీన్ని 500 మిల్లీ గ్రాములన చొప్పున రోజుకు రెండుసార్లు ఇచ్చారు. అలా తీసుకున్న వాళ్లలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారందరిలో HbA1c అనేది చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

రోజుకు 500 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవాళ్లలో ఈ HbA1c 0.7% తగ్గింపు కనిపించింది. ఇక రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం 1000 మిల్లిగ్రాముల మోతాదులో ఔషధం తీసుకున్నవారిలో  HbA1c లో 1.0% తగ్గింపు కనిపించింది. అంటే ఈ ఔషధం మోతాదు ఆధారిత మెరుగుదలను గుర్తించారు పరిశోధకులు. అంతేగాదు ఈ HTD1801 ఔషధం లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C, 'చెడు' రక్తం) స్థాయిలు, వాపు, హృదయనాళ ప్రమాదాలను గణనీయంగా తగ్గించింది. 

అలాగే ఈ పరిశోధనలో పాల్గొన్న రోగులెవరు బరువు పెరగలేదు కూడా. ఈ ఔషధంతో చికిత్స సురక్షితమైనది రోగులు ఈ మందు ప్రభావాన్ని తట్టుకోగలుగుతున్నారు. పైగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. 

దీన్ని కేవలం టైప్‌ 2 డయాబెటిస్‌కి మాత్రమే కాకుండా ఇతర చికిత్సలకు కూడా వినయోగించొచ్చని వెల్లడించారు. ఇక ఈ ట్రయల్స్‌కి ఔషధం HTD1801 తయారీదారులైన షెన్‌జెన్ హైటైడ్ బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నిధులు సమకూర్చింది. ఈపరిశోధన జామా నెట్‌వర్క్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. 

(చదవండి: 'మష్రూమ్‌ చట్నీ పౌడర్‌': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)