Breaking News

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ : జ్ఞాపకమే అలంకారం.. బాలీవుడ్‌ నటి

Published on Sat, 04/19/2025 - 11:25

బాలీవుడ్‌ నటి, ఇంటీరియర్‌ డిజైనర్‌ ట్వింకిల్‌ ఖన్నా పాత దుస్తులతో అందమైన గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు.‘మీ ఇంటిని మేకోవర్‌ చేయడానికి డెకార్‌ స్టోర్‌లకు వెళ్లాల్సిన పనిలేదు,  భారీ కొనుగోళ్లు అవసరం లేదు’ అని  తన అలంకరణ వస్తువులను చూపుతూ వివరిస్తున్నారు.  ఆమెకు తోడు పూనమ్‌ షా అనే ఆమె తన కూతురి చిన్ననాటి బొమ్మలను  అందమైన ఫర్నీచర్‌గా రూపొందించింది.  వీరి సృజన చూద్దాం రండి...

ఇంట్లో లివింగ్‌ రూమ్‌లోని ప్లెయిన్‌ గోడను రకరకాల ఫ్రేమ్‌లతో అలంకరించాలన్నా, కుషన్స్, సోఫా కవర్స్‌ని వినూత్నంగా మార్చాలన్నా పాతడ్రెస్సులు, కుర్తాలనే ఎంచుకోవచ్చునంటారు బాలీవుడ్‌ నటి, రచయిత్రి, ఇంటీరియర్‌ డిజైనర్‌ ట్వింకిల్‌ ఖన్నా. ఆమె తన పాతచీరలు, స్కార్ఫ్‌లు, పాత కుషన్‌ కవర్లు, పాత దుపట్టాలను  అత్యంత అందంగా మార్చేసింది. ఇంటీరియర్‌ డెకార్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా సూచనలు చేస్తోంది ట్వింకిల్‌ – ‘మన దేశంలో వారసత్వ కళతో నిండిన హ్యాండ్లూమ్స్, ఇతర వస్తువులు చాలానే ఉన్నాయి. ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చే వస్తువులూ ఉంటాయి. వాటిని మన ఇంటి అలంకరణలో అద్భుతమైన కళాఖండాలుగా మార్చుకోవచ్చు.

నిండిన వార్డ్‌రోబ్‌కు శ్వాస
ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దీంతో మన వార్డ్‌రోబ్‌లోకి కొత్త కొత్త డిజైన్స్‌ వచ్చి, ప్లేస్‌ సరిపోనంతగా నిండిపోతుంటాయి. పాత చీరలు, కుర్తాలు, కానుకగా వచ్చిన డ్రెస్సులను తీసేయాలని కూడా అనిపించదు. ఒకప్పుడు ఎంతో ప్రియంగా మన ఒంటిని హత్తుకు పోయిన దుస్తులకు జీవం  పోసి వాటిని మరింత అందంగా, ఓ మంచి జ్ఞాపకంగా ఇంటిని అలంకరించవచ్చు.

సీజన్‌ షైన్‌ 
పండుగల సమయాల్లో సంప్రదాయ అలంకరణను ఇష్టపడతాం. సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ వాతావరణానికి తగినట్టు ఇంటిని మేకోవర్‌ చేయాలనుకుంటాం. ఇలాంటప్పుడు మొత్తం డెకర్‌ స్టోర్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఖరీదైన అలంకరణలలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా, ఉన్న ప్లేస్‌ని మీకు నచ్చిన ఫాబ్రిక్‌ను ఉపయోగించి, కొత్తగా మార్చేయవచ్చు.పాత చీరలు, కుర్తాలు, దుపట్టాలను ఉపయోగించి గ్యాలరీ గోడను సృష్టించవచ్చు. నేను తయారు చేసిన ఈ గ్యాలరీ గోడ చూస్తే నా పాత కుర్తా ఫ్యాబ్రిక్‌ అని ఎవరూ అనుకోరు. మనలో చాలామంది సెంటిమెంట్‌ కారణాల వల్ల కొన్ని డిజైన్లు ఉన్న ఫాబ్రిక్‌ పీసెస్‌ను దాచిపెట్టుకుంటారు. కానీ కాలక్రమేణా, అవి చెడిపోయి తమ ఆకర్షణను కోల్పోతాయి. వాటిని దాచి ఉంచడానికి బదులుగా అలంకార కళాఖండాలుగా తిరిగి ఉపయోగించవచ్చు.

అందమైన సృష్టి
ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్‌ ముక్కను ఫ్రేమ్‌ చేయండి. లేదాపాతచీరలను వాల్‌ హ్యాంగింగ్స్‌ గా ఉపయోగించండి. ఒకసారి మీ పాత డ్రెస్సులను ఈ అలంకార వస్తువులుగా రూపొందించడానికి ఇష్టపడితే, వాటినుంచి ఎన్నో అద్భుతమైన డిజైన్లకు మీరే సృష్టికర్త అవ్వచ్చు. కుషన్‌ కవర్లు, టేబుల్‌ రన్నర్ల నుండి లాంప్‌షేడ్‌లు, కర్టెన్‌ యాక్సెంట్‌ల వరకు, మీరు సృష్టించగల వాటికి పరిమితి లేదు. స్టీలు సామాన్ల వాళ్లకి వేద్దాం అని అట్టడుగున పడేసి ఉంచిన  పాతచీరలు, స్కార్ఫ్‌లు,పాత కుషన్‌ కవర్లు,పాత దుపట్టాలను బయటకు తీయండి. వాటితో మీ ఇంటికి ఎలాంటి అందాన్ని జోడించవచ్చో ఆలోచించండి!’’ అని ఛాలెంజ్‌ విసురుతున్నారు ట్వింకిల్‌. 

ముంబై వాసి పూనమ్‌ షా తమ పాత జ్ఞాపకాలకు శాశ్వత రూపాన్ని అందిస్తోంది. పిల్లలు చిన్నతనంలో ఆడుకున్న రకరకాల బొమ్మలు, వాడిన పెన్సిళ్లు, ఎరేజర్లు, చాకొలెట్‌ రేపర్లు.. ఇలా ఎన్నో ఉంటాయి. పిల్లలు పెద్దయ్యాక కూడా వాళ్లు ఎంతో అబ్బురంగా వాడిన వాటిని పడేయడానికి చాలామంది తల్లులకు మనసొప్పదు. అలాగని, ఇంట్లో వాటిని ఎక్కడ దాచి ఉంచాలో కూడా తెలియదు. కొన్నింటిని షో కేస్‌లో పెట్టి... మిగిలిన, విరిగిన, పాడైపోయిన బొమ్మలను పడేస్తుంటారు. అలా పడేసే బొమ్మలను రెసిన్‌ ఆర్ట్‌ ఫర్నిచర్‌గా మార్చేస్తోంది 37 ఏళ్ల పూనమ్‌ షా. ప్రతి బొమ్మకు ఒక కథ ఉంటుంది. ఒక జ్ఞాపకం ఉంటుంది. అలా కొన్నింటితో కుర్చీ, టేబుల్, క్యాండిల్‌ హోల్డర్‌... ఇలా మన ఇంట్లో మరో వస్తువుగా రూపొందించుకోవచ్చు. ఈ ఆర్ట్‌ నాకు ఎన్నో అవకాశాలకు మార్గం చూపింది. కొన్నేళ్ల క్రితమే నాకు రెసిన్‌ ఆర్ట్‌లో నైపుణ్యం ఉన్నా కోవిడ్‌ టైమ్‌లో నా ఏడేళ్ల కూతురు ‘నా బొమ్మలను కొత్తగా రెడీ చేయవచ్చా’ అని అడిగింది. ఆ ఆలోచన ఇలా టాయ్‌ ఆర్ట్‌ ఫర్నీచర్‌కు  ప్రాణం  పోసింది’ అంటారు పూనమ్‌.  
– నిర్మలారెడ్డి
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)