Breaking News

Twinkle Khanna: చచ్చిపోతాననే అనుకున్నా!

Published on Wed, 10/30/2024 - 09:43

బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు ప్రకృతి కల్పించిన అత్యవసరతను తీర్చుకోటానికి మహిళలకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం  అన్నది ఇప్పటికీ ఉంది. ఏ చోటా వారికి  ‘చాటు‘ దొరకదు. ప్రతిచోటా మగవాళ్లు.. మగవాళ్లు... మగవాళ్లు. ఎంతసేపని ఆపుకుని ఉండగలరు? చచ్చేంత పనౌతుంది.

1990 లలో ‘జాన్‌‘ షూటింగ్‌ అప్పుడు  ట్వింకిల్‌ ఖన్నాకు ఇలాంటి గడ్డు కాలమే దాపురించింది. చీకటితోనే కాలకృత్యాలు ముగిసినా, వెలుగొచ్చాక మళ్లీ ఒకసారి ‘ఒకటికి‘ వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్‌ జరుగుతూ ఉన్నది ఒక కొండ పైన. చుట్టూ అంతా మగవాళ్లు. తను, ఒక హెయిర్‌ డ్రెసర్‌ మాత్రమే అక్కడున్న అమ్మాయి. 

వ్యానిటీ వ్యాన్‌ కూడా లేని రోజులు అవి! అసహాయంగా అలా ప్రాణాలు ఉగ్గబట్టుకునే ఉన్నారు ట్వింకిల్‌. మధ్యాహ్నం 3 గంటలు అయింది. ‘ఇక చచ్చిపోతాననే అనుకున్నాను. చివరికి భరించలేక నేనే క్రాలర్‌ నడుపుకుంటూ ఆ కొండ ప్రాంతంలో వెళ్లగలిగినంత దూరం వెళ్లి, తేలికపడ్డాను ‘ అని.. తనకెదురైన అనుభవాన్ని తన ‘ట్వీక్‌ ఇండియా‘ ఛానల్‌లో తాజాగా షేర్‌ చేసుకున్నారు ట్వింకిల్‌ ఖన్నా.

మునుపు జయా బచ్చన్‌ కూడా ఇలాంటి భయానక పరిస్థితి గురించే తన మనవరాలు నవ్య నవేలీ నందా పాడ్‌ కాస్ట్‌లో బయటికి చెప్పుకున్నారు. ‘ఔట్‌ డోర్‌ షూటింగ్‌ లకు వెళ్ళినప్పుడు మాకు వ్యాన్‌ లు ఉండేవి కావు. పొదల చాటునే దుస్తులు మార్చుకోవలసి వచ్చేది. ప్రతిదీ పొదల వెనకే! కనీసం టాయ్‌లెట్స్‌ కూడా ఉండేవి కావు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కొన్నిసార్లు 3–4 సార్లు ప్యాడ్స్‌ మార్చుకోవలసి వచ్చేది. 

వాటిని ఒక ప్లాస్టిక్‌ కవర్‌ లో కట్టి ఉంచి, ఇంటికి వెళ్లాక పడేయవలసి వచ్చేది‘ అని చెప్పారు జయాబచ్చన్‌. పిల్లలు ఎక్కడ కావలిస్తే అక్కడ పని కానిచ్చేస్తారు. ఈ విషయంలో మగవాళ్లు పిల్లలుగా ఉండగలరు. కానీ  స్త్రీలకు ప్రకృతి కొన్ని స్వభావసిద్ధమైన పరిమితులను విధించింది. సగటు మహిళ అయినా, స్టార్‌ సెలబ్రిటీ అయినా.. వారి దేహధర్మాలు, సంకోచాలు, బిడియాలలో తేడాలేమీ  ఉండవు. వాళ్లకు ఆ ‘స్పేస్‌‘ కల్పించటం, చూపించటం, లేదా ముందుగా ఏర్పాటు చేసి ఉంచటం పురుష ధర్మం. పురుష లక్షణం కూడా! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)