Breaking News

ప్రజాసేవే లక్ష్యం

Published on Tue, 04/01/2025 - 01:12

పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్‌వన్  టాపర్‌ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్‌ ర్యాంక్‌ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్‌1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..

‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఉండేది సఫిల్‌గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్‌ సీనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌. పదో తరగతి  సఫిల్‌గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్‌ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్‌తో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. మాస్టర్స్‌ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్‌ చేద్దామని అనుకున్నా. 

కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్‌పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్‌కు నోటిఫికేషన్  రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్‌ చెక్‌ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్‌ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్‌కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌1 పరీక్షలో ఫస్ట్‌ ర్యాంక్‌  సాధించాను. 

2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్‌గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్‌లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్‌లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.

సివిల్స్‌ సాధనే ఆశయం...
నా జీవితాశయం సివిల్స్‌.. కెరీర్‌లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.

సోషల్‌ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలి
కోచింగ్‌ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్‌ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్‌లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. 
– డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్‌ వన్  టాపర్‌ 
 
– పవన్‌ కుమార్‌ పలుగుల, సాక్షి, ఉప్పల్‌/ కాప్రా

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)