Breaking News

ట్రిలియనీర్‌ మస్క్‌ వెనుక.. ఆ లేడీబాస్‌!

Published on Sat, 06/13/2026 - 11:01

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచి మరో చరిత్ర సృష్టించారు ఎలాన్‌ మస్క్‌. ఐపీవో విజయవంతం కావడంతో ఆయన ‘స్పేస్‌ఎక్స్‌’ కంపెనీ విలువ రికార్డులు బద్ధలు కొట్టింది. అలా.. మస్క్‌ సంపద అమాంతం పెరిగిపోయింది. అయితే వివిధ కంపెనీలతో వ్యాపార రంగాన్ని శాసిస్తున్న మస్క్‌ ‘స్పేస్‌ఎక్స్‌’ సక్సెస్‌ వెనుక.. ఓ మహిళ పాత్ర ఉందని తెలుసా?. స్పేస్‌ఎక్స్‌ పని అయిపోయిందనుకున్న టైంలో ఆమె అడుగు సీన్‌ మొత్తాన్ని మార్చేసింది.

మస్క్‌ కలలకు వ్యాపార రూపం ఇచ్చి, సంక్షోభాల్లో సంస్థను గట్టెక్కించి, స్పేస్‌ఎక్స్‌ను ప్రపంచ అగ్రశ్రేణి అంతరిక్ష సంస్థగా తీర్చిదిద్దిన ఆ మహిళే గ్విన్‌ షాట్‌వెల్‌. స్పేస్‌ఎక్స్‌ ప్రెసిడెంట్‌గా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న షాట్‌వెల్‌ను చాలామంది "మస్క్‌ విజన్‌కు ఎగ్జిక్యూషన్‌ ఇంజిన్‌"గా అభివర్ణిస్తారు. మస్క్‌ అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను ప్రకటిస్తే.. వాటిని సాధ్యమైన వ్యాపార ప్రణాళికలుగా మార్చి అమలు చేయడంలో షాట్‌వెల్‌ కీలక పాత్ర పోషించారని అంటారు. అందుకే తాజాగా మస్క్‌ ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన వేళ.. ఆయన వెనుక నిలిచిన ఈ లేడీబాస్‌ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

సంక్షోభ సమయంలో అండగా..
స్పేస్‌ఎక్స్‌ ప్రారంభ దశలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా 2006 నుంచి 2008 మధ్య జరిగిన తొలి మూడు ఫాల్కన్‌-1 రాకెట్‌ ప్రయోగాలు వరుసగా విఫలమవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. కంపెనీ వద్ద నగదు నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయని, మరో ప్రయోగం కూడా విఫలమైతే స్పేస్‌ఎక్స్‌ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలోనే గ్విన్‌ షాట్‌వెల్‌ తన వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 

నాసా చేపట్టిన కమర్షియల్‌ రీసప్లై సర్వీసెస్‌ (CRS) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరకు రవాణా చేసే 1.6 బిలియన్‌ డాలర్ల భారీ ఒప్పందాన్ని ఆమె కుదుర్చగలిగారు. అప్పటివరకు అంతరిక్ష రంగంలో పెద్దగా గుర్తింపు లేని ప్రైవేట్‌ సంస్థకు నాసా ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం సంచలనంగా మారింది. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన నిధులు స్పేస్‌ఎక్స్‌కు ఆర్థిక ఊపిరి పోయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంస్థపై విశ్వాసాన్ని పెంచాయి. చాలామంది విశ్లేషకులు ఈ డీల్‌ను స్పేస్‌ఎక్స్‌ చరిత్రను మలుపుతిప్పిన ఘట్టంగా, గ్విన్‌ షాట్‌వెల్‌ కెరీర్‌లో అత్యంత కీలక విజయంగా పేర్కొంటారు.

స్పేస్‌ఎక్స్‌కు అసలు బలమే ఆమె
2002లో సంస్థ ప్రారంభమైనప్పుడు.. అందులో 11వ ఉద్యోగిగా చేరారు షాట్‌వెల్‌. ప్రభుత్వ సంస్థలు, ఉపగ్రహ కంపెనీలు, వాణిజ్య భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ స్పేస్‌ఎక్స్‌కు విశ్వసనీయత తీసుకొచ్చారు. బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు సాధించడంతో పాటు స్టార్‌లింక్‌ విస్తరణ, వేలాది మంది ఉద్యోగుల నిర్వహణ, సంస్థ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఆమెను స్పేస్‌ఎక్స్‌కు ‘వెన్నెముక’గా అభివర్ణిస్తుంటారు.

మస్క్‌ కలలకు వ్యాపార రూపం
చిన్నతనంలో రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ.. ఒకరోజు మనుషులను అంగారక గ్రహానికి పంపాలనే కలలు కనేవాడట ఎలాన్‌ మస్క్‌. ఆ స్ఫూర్తితోనే.. స్పేస్‌ఎక్స్‌ను స్థాపించి మార్స్‌ కాలనీలు, పునర్వినియోగ రాకెట్లు, స్టార్‌షిప్‌ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టగలిగారు. అయితే మస్క్‌ ఊహించిన ఆ భారీ లక్ష్యాలకు ఆర్థిక బలం చేకూర్చడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార ఒప్పందాలు కుదుర్చడం, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలను గ్విన్‌ షాట్‌వెల్‌ భుజాన వేసుకున్నారు. 

తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌
స్పేస్‌ఎక్స్‌ షేర్లు నాస్‌డాక్‌లో చరిత్రాత్మకంగా లిస్ట్‌ కావడంతో సంస్థ విలువ భారీగా పెరిగింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కును దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ప్రపంచ చరిత్రలో ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన తొలి వ్యక్తిగా మస్క్‌ నిలిచారు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌, స్టార్‌లింక్‌, న్యూరాలింక్‌ వంటి సంస్థల్లోని వాటాలు ఆయన సంపదను ఈ స్థాయికి చేర్చాయి.

గ్విన్‌ షాట్‌వెల్‌ వ్యక్తిగత జీవితం..
1963 నవంబర్‌ 23న అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రం ఎవాన్‌స్టన్‌లో జన్మించిన గ్విన్‌ షాట్‌వెల్‌.. చికాగో సమీపంలోని లిబర్టీవిల్‌లో పెరిగారు. ఆమె తండ్రి మెదడు శస్త్రచికిత్స నిపుణుడు (బ్రెయిన్‌ సర్జన్‌) కాగా, తల్లి కళాకారిణి. చిన్నతనంలో అంతరిక్ష రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, టీనేజ్‌లో మహిళా ఇంజినీర్ల సమావేశానికి హాజరైన తర్వాత ఇంజినీరింగ్‌ వైపు ఆమె ఆకర్షితులయ్యారు. అనంతరం నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ (JPL)లో ఇంజినీర్‌గా పనిచేసిన రాబర్ట్‌ షాట్‌వెల్‌ను ఆమె వివాహం చేసుకుని జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన గ్విన్‌.. కుటుంబ జీవితం, స్పేస్‌ఎక్స్‌ బాధ్యతలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్‌ ప్రాంతంలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల పశువుల ఫారాన్ని కూడా కుటుంబంతో కలిసి నిర్వహిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్‌-అలా.. 
స్పేస్‌ఎక్స్‌ (Space Exploration Technologies Corp.)ను ఎలాన్‌ మస్క్‌ 2002లో స్థాపించారు. అంతరిక్ష ప్రయాణ వ్యయాన్ని తగ్గించడం, భవిష్యత్‌లో మనుషులను అంగారక గ్రహానికి పంపడం సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఫాల్కన్‌-9, ఫాల్కన్‌ హెవీ రాకెట్లు, డ్రాగన్‌ వ్యోమనౌకలు, స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌తో స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాసాకు మానవ, సరకు రవాణా సేవలు అందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థగా గుర్తింపు పొందింది.

Videos

భయపడుతున్న గ్రామస్తులు అసలు అక్కడ ఏం జరుగుతుంది?

Gold Marker Crash : డబుల్ ధమాకా! గోల్డ్ రేట్స్ డౌన్

ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేసింది వాళ్లే ఇదిగో ప్రూఫ్స్ ...?

టీచర్ గా ఉన్నప్పుడు కూడా చెప్పుతో కొట్టావట... అనితను ఏకిపారేసిన నాగమల్లేశ్వరి

మేడిగడ్డతో ముడిపడి ఉన్న కాళేశ్వరం భవిష్యత్తు!

పెన్ అనుకుని జేబులో పెట్టుకుంటే అంతే సంగతులు..!

నందూస్ వరల్డ్ కంపెనీలన్నీ మూసేసి..! నెక్స్ట్ జరగబోయేది ఇదే

కన్నడ బ్యూటీ క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

శవాన్ని బూడిద చేసేశారా..!? సాయికృష్ణ కేసుపై కారుమూరి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఒకాయన ఇంకా నువ్వు జైలుకు పోలేదా అని అనగానే..?

Photos

+5

‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు)

+5

స్పెయిన్‌ను నిలువ‌రించిన అడ్డుగోడ‌.. 40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు)

+5

మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ

+5

తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. (ఫోటోలు)

+5

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)