Breaking News

ఎఫ్‌–టామ్‌ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి

Published on Mon, 10/28/2024 - 14:07


ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్‌–టామ్‌ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్‌ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు.  చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన  తదితరులు సేవలందించారు.    

కపిల్‌ పాటిల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌  
భివండీ: కపిల్‌ పాటిల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్‌లోని సాయి చౌక్‌ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ పాటిల్‌ నేతృత్వంలో నవంబర్‌ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్‌ ఐడల్‌ విన్నర్, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సింగర్‌ అభిజిత్‌ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్‌తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
 

 

. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)