Breaking News

భావితరాల కోసం..

Published on Sat, 08/17/2024 - 12:59

ఒకప్పుడు ప్రజలంతా చేదుడుబావి, మెట్ల బావుల నీటిని తాగేవారు. కాలక్రమంలో వాటిని పక్కన పెట్టి చెరువులు, వాగులు, బోర్లు, కులాయిల నీటిని తాగుతున్నారు. ఓ దేవాలయం ఉందంటే దానికి చుట్టుపక్కల ఓ బావిని తవ్వి కోనేరుగా వాడే వారు. కాల క్రమంలో వాటి నిర్వహణ భారం కావడం, ఆ నీటిని వాడకపోవడంతో అవన్నీ పూడుకుపోయాయి. అలాంటి మెట్ల బావుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయటంతో పాటు వాటిని ఎన్నో జీవరాశులకు కేంద్రంగా మార్చేందుకు సాహే అనే ఎన్‌జీఓ సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో బన్సీలాల్‌పేట మెట్ల బావిని పునరుద్ధరించి రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించి ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రారంభించిన విషయం తెలిసిందే.  – మణికొండ

బన్సీలాల్‌పేట మెట్ల బావి తరహాలోనే రాష్ట్రంలోని గచ్చిబౌలి, బైబిల్‌హౌస్, కోకాపేట, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, మంచిరేవుల లాంటి 25 చోట్ల బావులను పునరుద్ధరించారు. పనికిరాని వాటిగా మరుగున పడిన వాటికి జీవం పోసి తిరిగి ఉపయోగంలోకి తేవటం, ఏకంగా వాటిని పర్యాటక, సాంస్కృతిక  కేంద్రాలుగా తీర్చిదిద్దడం అందరినీ ఆకర్షిస్తున్నాయి. 

జీవరాశులకు ఉపయుక్తంగా.. 
వందల సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడిన బావులను పునరుద్ధరిస్తే మరో వంద సంవత్సరాల పాటు ప్రజలకు జీవరాశులకు ఉపయోగపడతాయనే  ఉద్దేశంతో చేపడుతున్న పనులు మన్ననలు పొందుతున్నాయి. బావులను పునురుద్ధరించడంతో పాటు వాటి చుట్టూరా లైటింగ్, పార్కులు ఏర్పాటు చేస్తుండటంతో వాటి వద్ద గడిపేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, చెరువులు, కాలువలు, నదులను పునరుద్ధరించి, వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సాహే సంస్థ 12 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అదే క్రమంలో ఇలాంటి మూతబడిన బావులను పునరుద్ధరిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని పలువురు సలహా ఇవ్వడంతో వాటి పునరుద్ధరణ పనులను గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్నారు. అందులో భాగంగా 25వ బావిగా మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న బావిని  పునరుద్ధరించారు. దేవాలయానికి ఆగ్నేయంలో వాస్తుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని గతంలో పూర్తిగా పూడ్చివేశారు. 

సాహే ప్రతినిధులు అలాంటి బావుల విశిష్టతను తెలపడంతో తిరిగి తెరిచేందుకు ఆలయ పూజారులు అంగీకరించటంతో నెల రోజులుగా శ్రమించి పునరుద్ధరించారు. దానిని మరింత అందంగా తీర్చి దిద్దేందుకు చుట్టూరా గోడకట్టడం, లైటింగ్, పార్కు ఏర్పాటు పనులను కొనసాగిస్తున్నారు. ఈ పనులన్నింటికీ రూ.38 లక్షలను వెచి్చస్తున్నారు. కామారెడ్డిలోనూ మరో బావిని, చందానగర్‌లోని భక్షికుంట బావిని పునరుద్ధరించే పనులను చేపడుతున్నారు.

జల భాండాగారాలుగా.. 
పురాతన బావులను పునరుద్ధరిస్తే దాని కేంద్రంగా అనేక జీవరాశులు జీవనం ఏర్పాటు చేసుకుంటాయి. వాటిని కాస్త తీర్చిదిద్దితే పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడతాయి. వాటిల్లో చెత్తా చెదారం వేసి మూసివేసి నిరుపయోగంగా మార్చారు. ఒక్క బావి ఉంటే దాని చుట్టుపక్కల భూగర్భ జలం పెరుగుతుంది. దీంతో ప్రజలు నీటి బాదల నుంచి కొంతైనా ఉపశమనం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బావులు ఎక్కడ ఉన్నా వాటిని పునరుద్ధరిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు అవసరమైన నిధులను పలు సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌గా తీసుకుంటున్నాం.                                     
– కల్పన రమేష్‌ సాహే సంస్థ నిర్వాహకురాలు  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)