Breaking News

స్క్రీన్ టైం పెర‌గ‌డం వ‌ల్లా గుండెపోటు!

Published on Mon, 09/30/2024 - 14:20

అమెరికా లాంటి దేశాల్లో స‌గ‌టున 45 ఏళ్ల‌కు గుండెపోటు వ‌స్తుంటే.. భార‌త‌దేశంలో మాత్రం అంత‌కంటే ప‌దేళ్ల ముందే, అంటే 35 ఏళ్ల వ‌య‌సులోనే వ‌చ్చేస్తోంది. ఇంత‌కుముందు ర‌క్త‌పోటు, మ‌ధుమేహం, కొలెస్ట‌రాల్ లాంటివి ప్ర‌ధాన ముప్పు కార‌కాలుగా ఉంటే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఎక్కువ స్క్రీన్ టైం ఉండ‌డం కూడా గుండెపోటుకు కార‌ణం అవుతోంది! 

దీనికితోడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఎగ్రిగేట‌ర్ల వ‌ద్ద రోజూ ఫుడ్ ఆర్డ‌ర్లు పెట్టుకోవ‌డం కూడా ఇందుకు దారితీస్తోంది. ఈ స‌రికొత్త ప‌రిణామాల‌ను న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ ఎ. సాయి ర‌విశంక‌ర్ వివ‌రించారు.

  • మొబైల్, ల్యాప్‌టాప్‌, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు స‌గ‌టున 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు చూస్తున్నారు. వీట‌న్నింటినీ స్క్రీన్ టైం అనే అంటారు. ఇలా ఎక్కువ‌సేపు తెర‌కు అతుక్కుపోయి ఉండ‌డం వ‌ల్ల గుండెపోటు వ‌స్తున్న సంద‌ర్భాలూ ఉంటున్నాయి.

  • వివిధ ఫుడ్ ఎగ్రిగేట‌ర్ల వ‌ద్ద నుంచి పీజాలు, బ‌ర్గ‌ర్లు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు దాదాపు రోజూ ఆర్డ‌ర్లు పెట్టుకుంటున్నారు. ఎంత పెద్ద హోట‌ల్ నుంచి తెప్పించుకున్నా, అక్క‌డ వాడిన వంట‌నూనెలు మ‌ళ్లీ మ‌ళ్లీ వాడ‌డం వ‌ల్ల కొలెస్ట‌రాల్ పెరిగిపోయి గుండెపోటుకు కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌పంచంలోనే ఫుడ్ ఆర్డ‌ర్ల‌లో భార‌త‌దేశం అగ్ర‌స్థానంలో ఉంది.

  • వ్యాయామం అస్స‌లు ఉండ‌డం లేదు. ప‌ని ఉన్నంత‌సేపు ప‌ని చేసుకోవ‌డం, త‌ర్వాత మొబైల్ లేదా టీవీ చూసుకోవ‌డం, ప‌డుకోవ‌డంతోనే స‌రిపెట్టేస్తున్నారు. స‌గ‌టున రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి క‌నీసం ఐదారు రోజుల పాటు న‌డ‌క‌, ఇత‌ర వ్యాయామాలు చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నిశ్చ‌ల జీవ‌న‌శైలి వ‌ల్ల కూడా చిన్న‌వ‌య‌సులోనే గుండెపోటు కేసులు వ‌స్తున్నాయి.

  • మాన‌సిక ఒత్తిడి, నిద్ర లేక‌పోవ‌డం కూడా గుండెపోటుకు దారితీస్తోంది. ఉద్యోగాల ప‌రంగా అయినా, లేదా వ్య‌క్తిగ‌త జీవితంలో స‌మ‌స్య‌ల‌ వ‌ల్ల అయినా మాన‌సిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. దానికి తోడు రోజుకు క‌నీసం 7-8 గంట‌ల మంచి నిద్ర ఉండాలి. అది లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా గుండెపోటు వ‌స్తోంది. వీటికి సిగ‌రెట్లు కాల్చ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం లాంటివి మ‌రింత ఎక్కువ‌గా కార‌ణాలు అవుతున్నాయి.


-డాక్ట‌ర్ ఎ. సాయి ర‌విశంక‌ర్, సీనియ‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్టు, ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి

 

(చదవండి: టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)