Breaking News

Today Tip : షుగర్‌ పేషెంట్లు ఎగ్స్‌ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?

Published on Fri, 06/27/2025 - 17:14

షుగర్ (diabetes) అనేది  దీర్ఘకాలిక వ్యాధి  ఒక్కసారి వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు జీవితాంతం మనల్ని వీడిపోదు అనేది ఒకప్పటి మాట. లైఫ్‌ స్టైల్‌ డిజార్డర్‌ కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామంతో పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని అనేది ఇప్పటి మాట. అయితే డయాబెటిస్‌ రాకుండానే జాగ్రత్తపడాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనే అలసత్వం  ప్రదర్శించకూడదు. అయితే ఎలాంటి ఆహారాలు తినాలి? ఎలాంటి ఆహారాలు తీనకూడదు అనే సందేహం చాలామందిని పట్టి పీడిస్తుంటుంది.  మరి ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డే లో భాగంగా   షుగర్ ఉన్న వారు ఎగ్స్ (Eggs) తినొచ్చా, ఒకవేళ తింటే ఎలా తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  చూద్దాం.

కోటడిగుడ్లలో బయోటిన్‌, పొటాషియం, యాంటి యాక్సిడెంట్స్‌ పుష్కలంగా లభిస్తాయి.  అలాగే  చాలా గ్లైసెమిక్  ఇండెక్స్ , కార్బొహైడ్రేట్స్ తక్కువగానూ  ప్రోటీన్ ఎక్కువగానూ ఉంటుంది. ఈ రెండూ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. కాబట్టి  గుడ్లును నిరభ్యంతరంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారికి ప్రోటీన్ అధిక మూలాన్ని అందిస్తుంది. కనుక చక్కగా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదు.

గుడ్లలోని కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి ఆందోళన అవసరం లేదని, అయితే మితంగా తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే వారానికి మూడు రోజుల పాటు రోజుకొకటి చొప్పున తినొచ్చు. అయితే  కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా  ఎక్కువగా  ఉన్నవారు  రెండు ఎగ్ వైట్స్ తింటే సరిపోతుంది.

అలాగే,  గుండె సమస్యలు, కిడ్నీ ,ఇతర సమస్యలున్న వారు ఎగ్స్ తినే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

నోట్‌ : ఇది ప్రాథమిక సమాచారం  మాత్రమే. షుగర్‌లో  ఉండే   రకాలను బట్టి,  వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు ఏం తినాలి అనేది ఆధారపడుంది. ఇలాంటి నిర్ణయాలు  వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. 

అయితే ఒత్తిడిలేని జీవితం, నీళ్లు తాగడం, నిద్ర,  తాజా కాయగూరలు, పళ్లు,  సిరిధాన్యాలతో చేసిన వంటలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం,  రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవడం మధుమేహం రోగులకు చాలా అవసరం. 
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు