Breaking News

హాలీడేస్‌... జాలీడేస్‌...

Published on Sun, 04/20/2025 - 10:00

వేసవి అంటే స్కూల్‌ ఉండదు, టైం టేబుల్‌ ఉండదు, హోంవర్క్‌ ఉండదు. రోజంతా ఖాళీ. పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచీ టీవీ లేదా మొబైల్‌ పట్టుకుని కూర్చుంటారు. పేరెంట్స్‌ కూడా సెలవులే కదా అని చూసీ చూడనట్లు ఊరుకుంటారు. కాని, ఈ నెల, రెండునెలల కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారి బోర్‌డమ్‌ను బ్రేక్‌ చేసి సృజనాత్మకత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మేధస్సు పెరిగే ప్రయాణంగా మార్చే అవకాశం ఉంది. అదెలాగో ఈ రోజు తెలుసుకుందాం.

బోర్‌ టైం... క్రియేటివ్‌ టైం...  
పిల్లలు బోర్‌గా ఫీలయిన సమయంలో మెదడులోని ‘డిఫాల్ట్‌ మోడ్‌ నెట్‌వర్క్‌’ అనే భాగం యాక్టివ్‌ అవుతుంది. ఇది క్రియేటివ్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఫ్యూచర్‌ ప్లానింగ్‌కు కేంద్రం. అలా జరగాలంటే రోజుకు కనీసం రెండుగంటల సమయం ఖాళీగా ఉంచండి. ఆ సమయంలో నో స్క్రీన్‌. అప్పుడే పిల్లల్లో ఊహాశక్తి పుట్టుకొస్తుంది. ఈ సమయం స్క్రిప్ట్‌ లేని సినిమా లాంటిది. ప్రతి బిడ్డ దర్శకుడే, కథానాయకుడే. పేపర్‌తో బొమ్మలు చేయడం, రాళ్లతో ఆటలాడటం, పాత వస్తువులతో టెంట్‌ తయారుచేయడం లాంటివి చేయమని చెప్పండి. ఇలాంటి ఆటలే పిల్లల్లో ప్లానింగ్, సెల్ఫ్‌ కంట్రోల్, భావోద్వేగాల అదుపును పెంచుతాయి. 

ఇంట్లోనే ‘ప్రేరణ  ప్రదేశం‘ 
మనలో చాలామంది పిల్లలను తక్కువ అంచనా వేస్తాం. కానీ వాళ్ళను ఒక చక్కటి పరిసరంలో ఉంచితే, వారు చూపించే అద్భుతాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అందుకోసం ఇంట్లో ఒక ‘యెస్‌ షెల్ఫ్‌’ తయారు చేయండి – అందులో క్రేయాన్లు, కాగితాలు, పాత గడియారాలు, భూతద్దం, కథల పుస్తకాలు. ఇలా ఉంచితే పిల్లలు అడగకుండా అన్వేషించడం మొదలుపెడతారు. ఓ పిల్లాడు పాత రేడియోను తెరిచి ‘‘ఇది ఎలా శబ్దం చేస్తుంది?’’ అని అడిగాడనుకోండి. అదే సైన్స్‌కు మొదటి అడుగు. విగోట్‌స్కీ చెప్పినట్టు ‘జోన్‌ ఆఫ్‌ ప్రాక్సిమల్‌ డెవలప్‌మెంట్‌’లో పిల్లలకు స్వేచ్ఛనిస్తే స్వయంగా నేర్చుకుంటారు. ఇలాంటి ఆటల వల్ల ఏకాగ్రత పెరుగుతుందని హార్వర్డ్‌ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. 

ఆటలు... జ్ఞానం పెంచే సాధనాలు
పిల్లలకు ఏకాగ్రత లేదని అనుకోవడం తప్పుడు అభిప్రాయం. వాళ్ళకు నచ్చే విషయంలో ఆశ్చర్యకరమైన ఫోకస్‌ చూపిస్తారు. జిగ్సా పజిల్స్, మెమరీ గేమ్స్, లూడో, చెస్‌లాంటి గేమ్స్‌ అందుబాటులో ఉంచండి. ఇది మెదడులోని సీఈఓలాంటి ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ను యాక్టివేట్‌ చేస్తుంది. ఇది డెసిషన్‌ మేకింగ్, సెల్ఫ్‌ కంట్రోల్, ప్రొడక్టివ్‌ టాస్క్స్‌కు అవసరమైనది. వారానికి ఒకరోజు గేమ్‌ నైట్‌ డిజైన్‌ చేయమని పిల్లలకు అప్పగించండి. అది లాజిక్, ఎమోషన్, లీడర్‌షిప్‌ లక్షణాలను పెంచుతుంది. 

భావోద్వేగాలను బయటపెట్టే ప్రయోగాలు
పిల్లలు ప్రతి రోజూ ఎన్నో ఎమోషన్స్‌ అనుభవిస్తారు. కానీ వాటిని ఎలా చెప్పాలో తెలియదు. పిల్లలు ‘నాకు బాధగా ఉంది’ అనే మాటే చెప్పలేరు. అందుకే భావప్రకటనను ఆటల ద్వారా నేర్పాలి. ఉదాహరణకు ఒక్కో భావాన్ని ఒక ప్రాణిగా గీయమని చెప్పండి. అంటే నిప్పు కళ్లతో రాక్షసుడు లాంటిది. అలాగే మూడ్‌ జర్నల్‌ రాయమనండి. అంటే, ‘నాకు ఈరోజు –––– అనిపించింది. ఎందుకంటే ––––.’ అలాగే ఒక్కో ఎమోషన్‌ మీద చీటీలు వేసి కథలు చెప్పడం. ఈ ప్రయత్నాలు ప్లే థెరపీలా పనిచేస్తాయి. భావాలను అర్థం చేసుకోవడం, వాటిని వ్యక్తం చేయడం వల్ల ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పెరుగుతుంది.

బంధాన్ని పెంచే యాక్టివిటీస్‌... 
వారంలో ఒక సాయంత్రం వాకింగ్, ఒక ఆదివారం కుకింగ్, రోజూ బెడ్‌టైమ్‌ స్టోరీ... ఇలాంటివి పిల్లల మనసుకు మిమ్మల్ని దగ్గర చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న పనులే పిల్లల ఎమోషనల్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌లా మారతాయని డాక్టర్‌ జాన్‌ గోట్మాన్‌ అంటారు. ప్రేమ, అంగీకారం, జాగ్రత్త... ఇవన్నీ మీరిచ్చే కానుకల కంటే విలువైనవి. 

వారానికో స్కిల్‌ ఛాలెంజ్‌...
వేసవి అంటే ఫ్రీడమ్‌నే కదా. అయితే ఆ ఫ్రీడమ్‌కు ఓ స్ట్రక్చర్‌ ఉండాలి. అందుకే ప్రతివారం ఒక స్కిల్‌ చాలెంజ్‌ ఇవ్వండి. గార్డెనింగ్, కుకింగ్, ఒరిగామి, క్రాఫ్ట్స్‌ కుటుంబ సభ్యుల కోసం గ్రీటింగ్‌ కార్డ్స్‌ తయారుచేయడం, రూమ్‌ చక్కదిద్దుకోవడం లాంటివి వారానికో చాలెంజ్‌ ఇవ్వండి. ఇలాంటివి చేయడం నేనీ పనులను స్వయంగా చేయగలననే నమ్మకాన్ని పెంచుతుంది.
 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)