Breaking News

మిద్దె తోట : షేడ్‌నెట్‌ అవసరమా? కాదా?

Published on Wed, 01/08/2025 - 14:16

మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది   పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్‌  ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. 

షేడ్‌నెట్‌లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్‌నెట్‌ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్‌ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు..   
 

వచ్చేది ఎండాకాలం. షేడ్‌నెట్‌కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో  పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.

పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా  రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. 

మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్‌ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. 

అలాగే, ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్‌ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. 

 ఇవీ చదవండి:  పార్కింగ్‌ స్థలంలో కంపెనీ : కట్‌ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్‌ ఏంటంటే!
గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్‌ సర్వే: మహిళలూ ఇది విన్నారా?


 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)