Breaking News

ఇక్కడ.. ఎంత చిన్న వయసులో ప్రారంభించామన్నదే ముఖ్యం!

Published on Sat, 07/25/2026 - 09:04

పొదుపు.. అనేది చిన్నమాటే అయినా జీవితంలో దీని విలువ వెలకట్టలేనిది. జీవితంలో ప్రతిదశలోనూ ఆర్థిక భద్రతనిస్తూ.. భవిష్యత్తుకి భరోసా కల్పిస్తుంది. అయితే ఇందుకోసం ముందుగానే ప్రణాళికను రూపొందించుకోవడం ముఖ్యం. అంతకన్నా ఖర్చులపై నియంత్రణ చాలా ముఖ్యం. అందుకోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని ఆర్థిక సూత్రాలు..

  • ఉద్యోగం వచ్చిన తొలినాళ్ల నుంచే పొదుపు చేయడం మంచిది. దీని వల్ల చక్రవడ్డీ రూపంలో అద్భుతమైన ప్రయోజనం పొందవచ్చు. ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామన్నదాని కంటే, ఎంత చిన్న వయసులో ప్రారంభించామన్నదే ముఖ్యం. 20 ఏళ్ల వయసులో చిన్న మొత్తంతో మొదలుపెట్టిన ఇన్వెస్ట్‌మెంట్, 40 ఏళ్ల వయసులో రెట్టింపు మొత్తంతో ప్రారంభించిన పెట్టుబడి కంటే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది.

  • దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనేది ఎప్పటి నుంచో ఉన్న ముచ్చట. ఆ మాట ఇక్కడ చక్కగా సరిపోతుంది. అందుకే ఎక్కువ లాభాలొచ్చే మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే కంటే ముందుగా మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఆకస్మిక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్లను ముందస్తుగా విక్రయించాల్సిన అవసరం రాకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్‌  మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా 40, 50 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున, హెల్త్‌ ఇన్సూ రెన్స్‌ కలిగి ఉండటం తప్పనిసరి.

  • భవిష్యత్తులో మనం ఇల్లు లేదా ఇతర అవసరాల కోసం లోన్‌ తీసుకోవాలనుకున్నప్పుడు క్రెడిట్‌ రిపోర్ట్‌ మన ఆర్థిక పాస్‌పోర్ట్‌లా పనిచేస్తుంది. క్రెడిట్‌ స్కోర్‌ పేలవంగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవచ్చు, లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు. దీనివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

    ఆర్థిక ప్రణాళిక అనేది ఇతరులతో పోల్చుకుని చూసేది కాదు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం, అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ప్రస్తుత వయసును బట్టి, సంపాదనను బట్టి  సొంతంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అపుడే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)