Breaking News

ఓపికతో పెంచండి ఒడిలో పిడుగులు

Published on Sat, 09/28/2024 - 09:41

‘పిల్లలు పైకి కనిపించేటంత సున్నితమైన వాళ్లు కాదు. వాళ్లను డీల్‌ చేయడం కత్తిమీద సామే. పిల్లలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామా లేక పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో విఫలమవుతున్నామా?’ పిల్లలపెంపకంలో కొత్తతరం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఇది. తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ కౌన్సెలర్‌ చెరువు వాణీమూర్తి. ఆమె గమనించిన అనేక విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.

ప్లానింగ్‌ ఉంటోంది... కానీ! 
ఈ తరం పేరెంట్స్‌ ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటున్నప్పటి నుంచే పిల్లల పెంపకం గురించి కచ్చితంగా ఉంటున్నారు. మంచి భవిష్యత్తు అందివ్వాలని, చక్కగా పెంచి ప్రయోజకులను చేయాలని కలలు కంటారు. ఎదురు చూసిన బిడ్డ చేతుల్లోకి వస్తుంది. వేడుకలతో బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన పేరెంట్స్‌ కూడా పెంచడంతో తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేక స్ట్రెస్‌కు లోనవుతున్నారు. 

ఆనందం వర్సెస్‌ సవాల్‌! 
పిల్లల పెంపకం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. అదే సమయంలో పెద్ద సవాల్‌ కూడా. అవగాహన లేకపోవడం వల్ల పేరెంటింగ్‌ను మోయలేని బాధ్యతగా భావిస్తున్నారు. పిల్లల విషయంలో తాము శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని గమనించుకోలేకపోతున్నారు. పిల్లలకు చిన్నప్పుడే ఎన్నో సంగతులు చెప్పేయాలని వారి వయసుకు మించిన జ్ఞానాన్ని బుర్రలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గ్రాహక శక్తి పిల్లలకు ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.

క్వాలిటీ టైమ్‌ ఇవ్వాలి! 
టీవీ, ఫోన్, సోషల్‌ మీడియాతో కాలక్షేపం చేయకుండా పిల్లలతో మాట్లాడుతూ, వారితో ఆడుకోవాలి. ప్రతి చిన్న సమస్యకీ పరిష్కారాల కోసం యూ ట్యూబ్‌లో వెతికి, అవి తమకు వర్తించకపోతే సరిగ్గా పెంచలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లల పెంపకంలో కొన్ని బాధ్యతలను గ్రాండ్‌ పేరెంట్స్‌కి కూడా పంచాలి. కొంతమంది... పిల్లలు తమకు మాత్రమే సొంతమని, తమ పిల్లల బాధ్యత పూర్తిగా తమదేనని, ఎవరి సాయమూ తీసుకోకుండా తామే చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి. మరికొంతమందిలో తమకు అన్నీ తెలుసని, ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనే పెడధోరణి కూడా కనిపిస్తోంది. అది కూడా మంచిది కాదు. అన్నీ తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. తెలుసుకుంటూ ముందుకు సాగాలి.

పంచుకుంటూ పెంచాలి! 
చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ సాధారణమేనని, పెంపకంలో ఇలాంటి ఒత్తిడులు ఉంటాయని ముందుగానే అవగాహన ఉండాలి. తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతను పంచుకుంటే ఇద్దరూ పెంపకాన్ని ఆస్వాదించవచ్చు. పిల్లలకు ప్రతి దశలోనూ తలిదండ్రుల సపోర్ట్, గైడెన్స్‌ అవసరమే. ఏ దశలో ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వాలో పేరెంట్స్‌ తెలుసుకుని, తాము నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటే స్ట్రెస్‌కు లోనుకాకుండా పేరెంటింగ్‌ని ఆస్వాదించగలుగుతారు. లెర్నింగ్‌ మైండ్‌ ఉంటే ఇది సాధ్యమే.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

కలిసి ప్రయాణించాలి! 
పేరెంటింగ్‌ అంటే పిల్లల పసితనం, బాల్యం, కౌమారం... ప్రతి దశల్లోనూ వారితో కలిసి సాగాల్సిన ప్రయాణం. తలితండ్రులు, పిల్లలు కలిసి చేయాల్సిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలంటే తల్లిదండ్రులు– పిల్లల మధ్య రిలేషన్‌ గట్టిగా ఉండాలి. పిల్లలను బేషరతుగా ప్రేమను పంచుతున్నామా, వారి పట్ల కరుణతో ఉంటున్నామా, తమ పరిధులను, అభిరుచులను వారి మీద రుద్దుతున్నామా, ఇతర పిల్లలతో పోలుస్తూ తక్కువ చేయడం లేదా ఎక్కువ చేయడం వంటి పొరపాటు చేస్తున్నామా... అనే ప్రశ్నలు వేసుకోవాలి. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా, వారికి ఏ చిన్న సమస్య ఎదురైనా తాము పెంపకంలో విఫలమవుతున్నామేమోనని అపరాధభావానికి లోనుకావాల్సిన అవసరమే లేదు. 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)