Breaking News

Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!

Published on Thu, 06/19/2025 - 17:26

మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే  మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణం. కానీ  నర్సరీనుంచి తెచ్చినపుడు  పచ్చని ఆకులు,  పువ్వులతో  కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే , ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం.   మరి  పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా,  మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు. టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా అదెలాగో చూద్దాం.

ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.  

ఇదీ చదవండి: Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!

అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్‌ ఫెర్టిలైజర్‌ ద్వారా మొక్కల్లో  పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే  శక్తిని అందిస్తుంది.
ఎలా వాడాలి? 
అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.

అరటి పండు తొక్కలను  వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.
అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని  నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు.

లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని  కూడా వాడుకోవచ్చు.

అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.  దీన్ని  అరటిపండు తొక్కలను చిన్న చిన్నముక్కలుగా కట్‌ చేసి, నీళ్లలో  వేసి మరిగించి, చల్లారిన తరవాత  మొక్కల మొదట్లో మొక్కకు ఒక చిన్న  కప్పు చొప్పున పోసుకోవాలి. 

ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది.
 

Videos

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)