Breaking News

ఈ టిప్స్‌ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!

Published on Mon, 09/29/2025 - 17:52

పండగల సీజన్ వచ్చేసింది.  బతుకమ్మ, దసరా సంబరాలతో త్వరలోనే దీపావళి పండుగ రానుంది. మరి ఫెస్టివ్‌ కళతో మహిళలు, ముద్దుగుమ్మలు  తెగ ఆరాటపడతారు. అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా సహజంగా, మెరిసే పోవాలంటే ఏం చేయాలి?  చిన్న చిన్న చిట్కాలతో  అందరిలోను ప్రత్యేకంగా కనిపించాలంటే  కొన్ని అమేజింగ్‌ టిప్స్‌  పాటిస్తే  చాలు. టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా అలాంటివి కొన్ని చూసేద్దామా.

పండగ హడావుడి, ఇంటి పనులతో ఫేస్ నిర్జీవంగా మారిపోయిందా? డోంట్‌ వర్రీ.. సహజసిద్ధమైన ఫేస్ మాస్క్‌లు, స్ర్కబ్‌లతో అందమైన చందమామలా మారిపోవచ్చు.

ముఖంపై బ్లాక్‌హెడ్స్‌  పోవాలంటే... క్యారట్‌ తురుములో పంచదార పొడి, ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని చేతి వేళ్ళతో ముఖంపై వలయాకారంలో మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్‌ హెడ్స్, వైట్‌ హెడ్స్‌ మటుమాయమవుతాయి.  ముఖంలో గ్లో వస్తుంది.

పచ్చి పాలతో  ముఖాన్ని క్లిన్సింగ్‌ చేసుకోండి.  పెరుగు,శనగపిండిలో కొద్దిగా కలబందను జోడించి ముఖానికి అప్లయ్‌ చేసి, ఆరిన తరువాత సున్నితంగా కడిగేసుకోండి.  ఇవి  అత్యంత ప్రభావవంతమైన చర్మ సంరక్షణ పద్ధతులు..  సున్నితమైన క్లెన్సర్ లేదా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సహజ గ్లో ఇస్తుంది. ఆ తరువాత చర్మం  మెరుపుకోసం ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. వోట్‌ మీల్, పాలు లేదా చిక్‌పా పిండితో పాటు తేనె మిశ్రమాన్ని ఎక్స్‌ఫోలియేటర్‌లుగా ఉపయోగించవచ్చు. ఇది  డెడ్ స్కిన్‌ని తొలగించి కాంతిని ఇస్తుంది. 

కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున దీనిని కొన్నిసార్లు మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ముఖంపై కొద్ది మొత్తంలో కొబ్బరి నూనెను మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత సాధారణ క్లెన్సర్‌తో  క్లీన్‌ చేసుకోవాలి.   కొబ్బరి అలెర్జీ ఉంటే మాత్రం దీనిని నివారించాలి.

15 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి.. హానికరమైన UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడం వల్ల చర్మం వృద్ధాప్య ప్రక్రియ నుండి కూడా రక్షిస్తుంది.

  • దుమ్ము, ధూళి వాతావరణానికి దూరంగా ఉండాలి. 

  • మరీ వేడి నీళ్లతో స్నానం  చేయవద్దు. దీనివల్ల ముఖ్యం నేచురల్‌ ఆయిల్స్‌ నష్టపోతాం.

  • సమతులం ఆహారం, ఎక్కువ నీరు,ప్రోబయోటిక్స్ ఫుడ్‌ తీసుకోవాలి పండ్లు , కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.శుద్ది చేసిన, ప్రాసెస్, ప్యాక్డ్ ఫుడ్, డీప్ ఫై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ, నూనె, ఉప్పు, చక్కెర అధిక వినియోగం శరీరానికి హాని చేస్తాయని గుర్తుంచుకోవాలి.

  • బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు, దోసకాయ, పాలకూర, బీట్ రూట్, క్యారెట్, యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీలతో కూడిన స్మూతీలను హెర్బల్ టీ తీసుకోవాలి. 

రోజంతా ఉత్సాహంగా ఉండేలా నిద్ర లేచిన కొద్దిసేపటికే  నెగటివ్‌ థాట్స్, చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే డిలీట్‌ చేయాలి. ఇష్టమైన సంగీతం వినాలి. వ్యాయమాలు, క్రియేటివ్‌ వర్క్‌పై దృష్టి పెట్టాలి.  వీటన్నింటితో కనీస వ్యాయామం  చేయడం చాలా అవసరం.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు