Breaking News

29న త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం

Published on Thu, 01/23/2025 - 16:18

గచ్చిబౌలి: మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈ నెల 29న హైదరాబాద్‌ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం(హెచ్‌టీఏఎంఎఫ్‌) వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలతో ఆకట్టుకోకున్నారు. 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి రచించిన అనేక కీర్తనలు, శాస్త్రీయ సంగీత రాగాలను విభిన్న శైలిలో ప్రయోగించారు. ఆ కీర్తనలు రామభక్తిని చాటిచెప్పడమే కాకుండా తాతి్వకత, ఆధ్యాత్మాకతను లోతైన రీతిలో వెలువరిస్తాయి. 

త్యాగరాజ స్వామి కర్నాటక శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలను స్మరిస్తూ యేటా సంగీతోత్సవం నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, కళలను, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో సంస్కృతి ఫౌండేషన్‌ 16 ఏళ్ల క్రితం హెచ్‌టీఏఎంఎఫ్‌ను స్థాపించింది. పదేళ్లుగా త్యాగరాజ ఆరాదనా సంగీతోత్సవం నిర్వహిస్తోంది.  

29న ప్రారంభం.. 
శిల్పారామంలో త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం జనవరి 29న ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ 15కు పైగా సుమధుర సంగీత కచేరీలు ఉంటాయి. 4వ రోజు గురుకులం పేరిట విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన ఉంటుంది. జంట నగరాల్లోని సంగీత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం 9 గంటలకు ‘పంచరత్న సేవ’ ఉంటుంది. కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా ‘గురు సన్మానం’ పేరిట ప్రసిద్ధ సంగీత విద్వాంసులను సంస్కృతి ఫౌండేషన్‌ సత్కరిస్తుంది. 400 మందికి పైగా సంగీతకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించనున్నారు. హనుమత్సమేత సీతారామలక్ష్మణులు, త్యాగరాజ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేక సేవ ఉంటుంది. 

ఇదీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్‌ : లైఫ్‌లో రిస్క్‌ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు


 

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు