Breaking News

Thursday Myths: గురువారం ఆ రంగు శుభసూచికం, అదృష్టం వరిస్తుందట!

Published on Thu, 07/13/2023 - 14:50

హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా పూజాక్రతువులను ఆచరించాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్దంగా భావిస్తారు. మరి గురువారం నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. 

గురువారం ఆ రంగు శుభసూచికం

  • గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయట. 
  • పెళ్లి ఆలస్యం అవుతున్నా, వివాహంలో సమస్యలున్నా గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా 11 వారాలు ఉపవాసాలు చేస్తే చాలా మంచిదట. 
  • గురువారం నాడు అరటిపండ్లను దానం చేసినా, పసుపు రంగు బట్టలు వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట. 
  • గురువారం అరటి చెట్లకు పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయట. 

గురువారం నాడు చేయకూడని పనులు

♦ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు  మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం. అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్‌ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం. 


♦ గురువారం శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయనకు కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు. 
♦ గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట. 


♦ గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు. 
♦ గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు. 

గమనిక: పైన పేర్కొన్న అంశాలు విశ్వాసాలకు, ఆచారాలకు సంబంధించినవి. వీటికి సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌, కశ్చితమైన ఆధారాలు లేవు.
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)