Breaking News

సరిలేరు మీకెవ్వరు..!

Published on Thu, 01/15/2026 - 11:02

మంచిర్యాలఅర్బన్‌: ఎడ్లబండ్ల పోటీల్లో గెలవాలంటే బలమైన ఎద్దులు, నియంత్రించగలిగే నైపుణ్యం, వ్యూహం, వేగం, సమన్వయంతో సత్తాచాటాల్సి ఉంటుంది. వీటన్నింటిలో పాతమంచిర్యాలకు చెందిన తూముల వెంకట్రామయ్యది అందెవేసిన చేయి. ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడమే కాకుండా పందేల్లో గెలుపు ఇచ్చే ఆనందం కోసం పోటీలు జరిగిన ప్రతీ చోటకు వెళ్లి వచ్చాడు. వెంకట్రామయ్య స్థానిక సిమెంటు కంపెనీలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందాడు. ఓ వైపు పని చేస్తూ వ్యవసాయం చేసేవాడు. 2013లో ఓసారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ముంజంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు మొదటిసారి ఎడ్లబండ్ల పోటీలు చూశాడు. 

ఎడ్లకు ఎలాంటి శిక్షణ లేకుండా పోటీల్లో పాల్గొని ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత ఎడ్లను ప్రత్యేకంగా పోషిస్తూ తర్ఫీదు ఇచ్చి పోటీల్లో సత్తా చాటాడు. జగిత్యాల జిల్లా లొత్తునూర్, రాపల్లి, సిల్వకోడూరు, గోవిందుపల్లి, చర్లపల్లి, నందిమేడారం ఇలా ఏ గ్రామంలో పోటీలు జరిగినా పాల్గొన్నాడు. 2015 నుంచి విజయపరంపరం కొనసాగింది. నాలుగేళ్లలో 36సార్లు గెలుపొందగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో లెక్కలేనన్ని సార్లు విజయబావుటా ఎగురవేశాడు. పాత మంచిర్యాలలో ఎనిమిదేళ్లపాటు ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.

చిన్నప్పటి నుంచి ఎద్దులంటే ఇష్టం..
ఎడ్ల శృతి కలవాలే. మన శృతి రెండూ ఉండాలే. మన చేతుల్లో మెదిలితేనే సులువుగా గెలువొచ్చు. ఎంతమంచి ఎడ్లనిచ్చినా ఇవన్నీ లేకుంటే గెలవడం కష్టం. ఓసారి చిన్నకోడూర్‌లో ఆ ఊరి పెద్ద మనిషి నీ ఎడ్లు ఇస్తే గెలుస్తా అన్నాడు. సరిగ్గా గీతకాడికి పోయినంక గెలువలేమని గ్రహించి వెనువెంటనే ఎడ్లబండి సవారీ నాకు ఇవ్వడంతో గెలిచా. వ్యవసాయం అంటే మక్కువ కావడంతో చిన్నప్పటి నుంచి ఎద్దులను ఇష్టంగా పెంచడం అలవాటైంది. అప్పట్లోనే నెలకు క్వింటాలు ఉల్వలు దాణాగా పెట్టేవాళ్లం. ఎద్దుల శిక్షణతోపాటు పది మందికి పోటీల్లో గెలుపొందడం ఎలా అనేదానిపై తర్ఫీదు ఇచ్చాను. వయస్సు పైబడడంతో పోటీలకు దూరంగా ఉంటున్న.
– తూముల వెంకట్రామయ్య, జిల్లా ఎడ్లబండ్ల పోటీల అసోసియేషన్‌ అధ్యక్షుడు

 

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)