Breaking News

వర్షాకాలంలో ఈ కూరగాయలు తీసుకోకపోవడమే మేలు..!

Published on Sun, 08/25/2024 - 13:45

సీజన్‌ మారేకొద్దీ మనం డైట్‌ కూడా మార్చాలి. ఆ సీజన్‌ లో కొన్ని ఫుడ్స్‌ తీసుకోవడం, కొన్నింటిని తీసుకోక΄ోవడం వంటివి చేయాలి. దీంతో ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది వర్షాకాలం. ఈ సీజన్‌లో కొన్ని పుడ్స్‌ తీసుకోకac΄ోవడమే మంచిది. అవేంటో తెలుసుకుందాం. 

ఫ్రూట్‌ సలాడ్‌.
మార్కెట్లో చాలా మంది ఫ్రూట్స్‌ని కట్‌ చేసి ఇస్తారు. వీటిని తీసుకోవడం తగ్గించాలి. వారు ఎలా నిల్వ చేస్తున్నారో తెలియదు. ఇందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. 

నిల్వ ఉన్న ఆహారం
కొన్నిసార్లు మన ఇంట్లో ఆహారం మిగిలి΄ోతుంది. దీనిని ఎక్కువ సమయం స్టోర్‌ చేసి తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ టైమ్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫుడ్‌పాయిజన్‌లా మారే అవకాశం ఉంది. అందుకనే ఈ ఫుడ్‌ని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. 

వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌
చల్లని వాతావరణంలో చాలా మంది సమోసా, పకోడి వంటి ఫ్రై  ఐటెమ్స్‌ ఎక్కువగా తింటారు. అయితే, వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా తక్కువగా తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. బయట చేసే ఈ ఫుడ్స్‌లో ఏ నూనె కలుస్తుందో తెలియదు కాబట్టి అలాంటి వాటి జోలికిపోకుండా ఉండటం చాలా ఉత్తమం. 

సీఫుడ్‌..
చేపలు, ఇతర సీ ఫుడ్‌ని ఈ టైమ్‌లో తీసుకోవడం తగ్గించడం, లేదా పూర్తిగా మానడం మంచిది. ఎందుకంటే వర్షం నీటిలో ఉన్న ఈ సీ ఫుడ్స్‌ తీసుకుంటే డయేరియా, వాంతులు, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. 

ఆకుకూరలు..
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఆకుకూర, క్యాబేజీ వంటి వాటి వాడకాన్ని వర్షాకాలంలో తగ్గిస్తే మంచిది. ఇందులో బ్యాక్టీరియా, ΄ారాసైట్స్‌ పెరగడమే ఇందుకు కారణం. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే చక్కగా కడిగి ఉడికించి వండితే రిస్క్‌ తగ్గుతుంది.

స్పౌట్స్‌..
మొలకల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. కానీ, వీటిలో ఈ సమయంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే అవకాశం ఉంది. వీటిని తినాలనుకుంటే చక్కగా క్లీన్‌ చేసి  

డెయిరీ ప్రొడక్ట్స్‌: 
అయిన పాలు, చీజ్, పనీర్‌ కూడా ఈ టైమ్‌లో తక్కువగా తీసుకోవాలి. దీనికి కారణం వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే అవకాశం ఉంది. వీటిని తీసుకున్ననప్పుడు కూడా సరిగ్గా పాశ్చరైజ్డ్‌ అయ్యాయా, ఎక్స్‌పైర్‌ డేట్‌ ఎప్పటివరకూ ఉందనేది తెలుసుకుని తీసుకోవాలి. లేదంటే వీటి బదులు పెరుగు, పాలని తీసుకోవచ్చు. 

(చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)