Breaking News

మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్‌ పేరెంట్స్‌ అయ్యారే!

Published on Sun, 09/07/2025 - 07:28

ఈ గ్రాండ్‌ పేరెంట్స్‌ ఉన్నారే... 
వాళ్ల రెండు నాల్కల ధోరణే వేరు. వీళ్లు పేరెంట్స్‌గా ఉన్నప్పుడు తమ పిల్లలు అన్నం తినకపోయినా... సరిగా చదవక΄ోయినా... మాట వినక΄ోయినా విపరీతంగా తిట్టేవారు. కసితీరా కొట్టేవారు. వెరసి... చెడుగుడాడేవాళ్లూ... చెమడాలెక్కతీసేవాళ్లు. ఈ ధోరణితో వాళ్లు ప్రవర్తిస్తున్న కాలంలో పిల్లలుగా మనం బితుకూ బితుకూమంటూ బతికేవాళ్లం. ఎట్టకేలకు వాళ్లిప్పుడు గ్రాండ్స్‌పేరెంట్స్‌ అయ్యారు.

కాలచక్రం గిర్రున తిరిగి మనకూ ఇప్పుడు పిల్లలు పుట్టారు. కాలేజీలో జూనియర్స్‌ సీనియర్స్‌ అయి ‘పేరేంట్య్రాగింగు’ పర్వదినాల కోసం మనమూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామా...? అదృష్టవశాత్తూ ఇప్పుడు మన వంతు రాగానే మన పిల్లలు అన్నం తిననప్పుడు మనం బెల్టు పట్టుకోబోయామా... వాళ్లెదురుగా వచ్చి పిల్లలముందు నిలబడిపోతారు. బెత్తం పట్టుకోబోయామా... అడ్డంగా వచ్చేసి కలబడిపోతారు. థూ  మన బతుకుచెడా... మన బండపడా... అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడూ బితుకూ బితుకే...

ఇప్పుడూ అదే బతుకే! 
వాళ్లే మన పేరెంటూ... మన నాటి పేరెంట్సే... నేటి గ్రాండ్‌ పేరెంట్సు. మళ్లీ సదరు గ్రాండు పేరెంట్సు... గ్రాండుగా వాళ్లు చెప్పొచ్చేదేమిటంటే...  ‘‘ఏం మాకు పిల్లలు పుట్టలేదా? మేం పెంచలేదా, పెంచడం మాకు తెలియదా’’ అంటూ దబాయింపు. అలా వాళ్లు తమ రెండు నాల్కల ధోరణితో మనల్ని నానామాటలు అంటూ ఉంటే... సదరు మన పేరెంట్సుకూ, మన పిల్లల గ్రాండుపేరెంట్సుకూ ఎదురుచెప్పకూడదంటూ మనలో మనం  అనేసుకునే మాటేమిటంటే... ‘‘అయ్యో.... మీకు తెలియక΄ోవడమేమిటీ? అప్పుడు మీరు పెంచిందీ, గసిరిందీ, కొట్టిందీ మమ్మల్నే... ఇప్పుడు పిల్లల ఎదురుగా నిలబడి΄ోతూ, కలబడిపోతూ గసురుతున్నదీ, మాటలు విసురుతున్నదీ మమ్మల్నే!’’ అంటూ గుసగుసగా గునుస్తూ... నేటి మన గ్రాండ్‌ పేరెంట్స్‌ గాండ్రుగాండ్రుల పట్ల మురుస్తూ ఇలా బతికేస్తున్నాం... బతికేస్తుంటాం.  

(చదవండి:    

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)