Breaking News

భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!

Published on Thu, 10/03/2024 - 07:24

కొంతమందికి తలనొప్పి తరచు వేధిస్తు ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. ఎందుకు వస్తుందో తెలియదు సడెన్‌గా వచ్చి ఏ పని చెయ్యనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నివారించాలంటే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో వారి మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.

  • కంప్యూటర్‌పై పనిచేసేవారు కంటిపై ఒత్తిడి పడకుండా యాంటీ గ్లేర్‌ గ్లాసెస్‌ ధరించవచ్చు. అలాగే ప్రతి గంట తర్వాత కంప్యూటర్‌ తెరపై నుంచి చూపు తప్పించి కాసేపు రిలాక్స్‌ అవాలి 

  • కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన సంక్లిష్టమైన (ఇంట్రికేట్‌)  డిజైన్లు అల్లే సమయంలో అదేపనిగా పనిచేయకుండా తరచూ బ్రేక్‌ తీసుకుంటుండటం మంచిది 

  • తమకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటం సరికాదు 

  • కాఫీ, చాకొలెట్స్, కెఫిన్‌ ఎక్కువగా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతలపానియాలకు దూరంగా ఉండాలి 

  • ఫలానా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అ΄ోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసకోవడం సరికాదు 

  • రణగొణ శబ్దాలకు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు

  • రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. కొన్నిసార్లు నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి తమ సౌకర్యం మేరకు నిద్రపోవడం మంచిది. ఒకవేళ ఈ సూచనల తర్వాత కూడా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. 

(చదవండి: గాంధీ జయంతి 2024: భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)